పాప్‌కార్న్ మనకు ఇంత మేలు చేస్తుందా????
పాప్‌కార్న్ అంటే ఇష్టపడని వారుండరు. దీనిలో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. ఆర్గానిక్ పాప్‌కార్న్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఈ పాప్‌కార్న్‌లో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. మరి వీటిలోని ఆరోగ్య విషయాలను తెలుసుకుందాం.
షుగర్, ఇన్సులిన్ పరిమాణాలను క్రమబద్ధీకరిస్తుంది. పాప్‌కార్న్‌లో ఫైబర్ కూడా ఉంది. ఇది అధిక బరువుని తగ్గిస్తుంది. దీనిలోని విటమిన్స్, మెగ్నిషియం, ఐరన్, మాంగనీస్ వంటి ఖనిజాలా ఎముకల బలానికి చాలా దోహదపడుతాయి. గుండె సంబంధిత వ్యాధులను అడ్డుకోవడంలో మంచిగా ఉపయోగపడుతుంది.
పాలకూరలో కన్నా పాప్‌కార్న్‌లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పెద్దప్రేగు క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతుంది. శరీర రోగనిరోధక శక్తిని పెంచుటకు పాప్‌కార్న్ చాలా సహాయపడుతుంది. ఇందులోని విటమిన్ బి3, బి6, ఫోలేట్ వంటి ఖనిజాలు ఎనర్జీని పెంచడంతో పాటు శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది.