శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 27 జులై 2019 (12:08 IST)

శరీరంలో నీరు తగ్గితే నోటి దుర్వాసన తప్పదా?

శరీరంలో నీరు తగ్గితే.. మెదడు ఆకలి వేస్తుందనే తప్పుడు సంకేతాలు పంపిస్తుంది. కాబట్టి ఆకలి వేసినప్పుడల్లా ఆహారం కాకుండా నీళ్లు తాగే ప్రయత్నం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నీరు ఎక్కువగా తీసుకోకపోవడం ద్వారా నోటి దుర్వాసన అధికమవుతుంది. లాలాజలంలో యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు ఉంటాయి. 
 
ఎప్పుడైతే నీరు తగ్గుతుందో నోరు పొడిబారి దుర్వాసన వెలువడుతుంది. ఒంట్లో నీరు తగ్గడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. విషయాలను తేలికగా మర్చిపోతూ ఉంటామని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
 
అలాగే శరీరంలో నీటి శాతం తగ్గితే, మెదడుకు చేరే నీరులో కూడా కొరత పడుతుంది. మెదడును కుదుపుల నుంచి కాపాడడానికి ఉపయోగపడే నీరు తగ్గిపోవడం వల్ల తలనొప్పి మొదలవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.