మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 10 మే 2021 (23:19 IST)

అనీమియా సమస్యతో బాధపడేవారు మామిడి పండ్ల రసం తాగితే ఏమవుతుంది?

మామిడిపండ్ల సీజన్ ఇది. ఈ పండ్లను పిల్లలు, పెద్దలు అమితంగా ఇష్టపడతారు. ఈ పండుని రసం చేసుకుని తాగడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మామిడి పండు రసంలోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం. 
 
మామిడి పండులో విటమిన్ సి, బీటాకెరోటిన్, పొటాషియం, ఐరన్ మరియు న్యూట్రియంట్స్ మన శరీరాన్ని వివిద రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. ఈ పండు జ్యూస్‌ని తాగడం వలన ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది.
 
అనీమియా సమస్యతో బాధపడేవారు మామిడి పండ్ల రసం తాగడం వలన అద్బుతమైన ప్రయోజనం కలుగుతుంది. దీనిలో ఉండే ఐరన్ ఈ సమస్యను నివారిస్తుంది. మామిడి రసం ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. అంతేకాకుండా దీనిలో ఉండే విటమిన్ ఎ కంటి సంబందిత సమస్యలను నివారిస్తుంది.
 
ఈ రసాన్ని తాగడం వలన రక్తపొటుని అదుపులో ఉంచుతుంది. కొలస్ట్రాల్ లెవల్స్‌ని అదుపులో ఉంచుతుంది. ఈ పండు జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. మామిడి పండ్ల రసాన్ని ప్రతిరోజు తాగడం వలన చర్మ సంబంధిత సమస్యలు, మొటిమలు, మచ్చలను నయం చేస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది.