శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 జూన్ 2020 (20:13 IST)

నూకకోలు రసాన్ని తాగితే మధుమేహం పరార్ (video)

Kohlrabi
కూరగాయల్లో నూక కోలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఊపిరితిత్తులకు నూకకోలు ఎంతగానో మేలు చేస్తుంది. నూక కోలు కూరల్లో విటమిన్ ఎ అధికంగా వుంటుంది. ఇది ఊపిరితిత్తులను ఆరోగ్యంగా వుంచుతుంది. నూక కోలు జీర్ణశక్తిని పెంచుతుంది. ఫైబర్‌తో కూడిన ఈ నూక కోలు మధుమేహానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఉదర సంబంధిత రోగాలను ఇది దూరం చేస్తుంది. నూక కోలు జ్యూస్ తాగితే డయాబెటిస్ నయం అవుతుంది. 
 
బ్రెస్ట్ క్యాన్సర్, పెద్ద పేగు, మల ద్వార క్యాన్సర్లను దూరం చేస్తుంది. బాలింతలు లేత నూక కోలును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నూక కోలు ఉదర సంబంధిత రోగాలకు చెక్ పెడుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. నూక కోలును తీసుకోవడం ద్వారా పైల్స్ సమస్య వుండదు.
 
ఎముకలకు బలాన్నిస్తుంది. నూక కోలును ఆహారంలో భాగం చేసుకుంటే నరాల బలహీనతకు చెక్ పెడుతుంది. నూకకోలు రక్తంలోని ఎర్రకణాలను ఉత్పత్తి చేస్తుంది. నూక కోలులోని వేళ్లలో బీటా కెరోటిన్, ఆరోగ్యమైన ధాతువులు ఉత్పత్తి చేస్తాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.