మణిపాల్ హాస్పిటల్లో కష్టమైన బోన్ మారో మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం
పశ్చిమ గోదావరి : మానవాళి మునుపెన్నడూ ఎదుర్కోని అత్యంత క్లిష్టమైన సవాళ్ళలో కోవిడ్-19 ఒకటి అన్నది వాస్తవం. మనందరం మన ఆరోగ్య స్థితిగతులను కాపాడుకోవలసిన ఆవశ్యకతను మరియు ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణా పరిష్కారాలు లభించునట్లు సామర్థ్యంను పెంచుకోవలసిన అవసరాన్ని ఈ కరోనా మహమ్మారి మనముందుకు తెచ్చినది. ప్రపంచం తన ఆరోగ్య సంరక్షణకి పునరంకితమవుతున్న దిశగా, మణిపాల్ హాస్పిటల్, విజయవాడ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి ఆరో గ్యపరమైన అన్నిరకాల ఇబ్బందులను పరిష్కరించుటకు సమాయత్తమైనది.
రోగులు అవసరమైన చికిత్సలు కొరకు దూర ప్రాంతాలకు వెళ్ళే శ్రమ లేకుండా అన్ని రకాలైన ఆరోగ్యసంరక్షణ పరిష్కారాలు ఒకేచోట లభించే విధంగా హాస్పిటల్ సకల సదుపాయాలు కల్పించినది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వృత్తి రీత్యా రైతుపై విజయవంతంగా నిర్వహించిన మూలకణ (బోన్‌మారో) మార్పిడి శస్త చికిత్స అందుకు ప్రత్యక్ష నిదర్శనం. మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో మణిపాల్ హాస్పిటల్, విజయవాడ వారు మాత్రమే ఈ చికిత్సను అందించగలిగారు.
“గత ఆరు నెలలుగా అంటే అక్టోబర్-2019 నుండి తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నానని రోగి మా హాస్పిటల్‌కు మార్చి-2020లో రావటం జరిగినది. అంతేకాక అతను అప్పటికే వెన్నుపూసలో బీటలు (పగుళ్ళు), రక్తహీనత (ఎనీమియా), మూత్ర పిండాలు వనిచేయకపోవటం వంటి పలురకాలైన అనారోగ్య ఇబ్బందులు కలిగి వున్నారు. అతనిని పరీక్షించి మల్టిపుల్ మైలోమా (ఒక రకమైన రక్త కణాల క్యాన్సర్) వ్యాధితో బాధపడుతున్నట్లు రోగనిర్దారణ చేయటమైనది. ఎముక మజ్జలో క్యాన్సర్ ప్లాస్మా కణాలు వృద్ది చెందటం ఈ స్థితికి కారణమని, వీటిని ఆరోగ్యకరమైన రక్త కణాలతో మార్చవలసివుంటుందని” ఈ కేసు గురించి మాట్లాడిన మణిపాల్ హాస్పిటల్, విజయవాడ కన్పల్టెంట్-మెడికల్ అంకాలజిస్ట్ మరియు బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్ డా.జి. కృష్ణారెడ్డి వివరించారు.
ఈ కేసు గురించి డా.మాధవ్ దంతాల- కన్సట్టింట్ హెమటో అంకాలజీ మరియు బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్, ఫిజీషియన్ మణిపాల్ హాస్పిటల్, విజయవాడ వారు మాట్లాడుతూ, “మేము అతనికి బోర్జేజోమిబ్, తాలిదోమిద్ మరియు డెక్సామెతాసోన్ లతోటి కీమోథెరపీ చేసాము. అటుతర్వాత అతనికి మెల్ఫాలాన్ తోటి హెచ్చు మోతాదులో కీమోథెరపీ మరియు ఆటోలోగాస్ మూల కణ మార్పిడి చికిత్స చేసాము. అక్టోబర్-2020 వరకు అతనికి (రోగికి) 8 దఫాలుగా కీమోథెరపీ చేసాము. అటు తర్వాత మూడు వారాలకు అతనిని హాస్పిటల్ నుండి సురక్షితంగా ఇంటికి పంపించాము మరియు అతను నిరంతరం మా పర్యవేక్షణలో ఉన్నారని” చెప్పారు.
ఇతని తర్వాత పశ్చిమ గోదావరికే చెందిన మరో ఇద్దరు ఇతర రోగులకు కూడ ఎముక మజ్ట మార్పిడి శస్త్ర చికిత్సలను హాస్పిటల్ విజయవంతంగా నిర్వహించిచినట్లు ఆయన తెలిపారు. డా.సుధాకర్ కంటిపూడి - హాస్పిటల్ డైరక్టర్, మణిపాల్ హాస్పిటల్, విజయవాడ వారు మాట్లాడుతూ, “తమ హాస్పిటల్ అంతర్జాతీయ ప్రమాణాలుతో మరియు అత్యాధునిక సౌకర్యాలతో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ కల్పించుటలో ముందుంటుంది. చికిత్స కొరకు హైదరాబాద్, బెంగుళూరు మొదలైనటువంటి నగరాలకు వెళ్ళకుండా, అనవసరమైన ఖర్చులు భారం తగ్గించుటకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రపంచ శ్రేణి ఆరోగ్యసంరక్షణను విజయవాడలోని మా హాస్పిటల్లో ఒకేచోట మేము అందిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరమైన అన్ని సంబంధిత ఆరోగ్య సంరక్షణ వైద్య సేవలను అందిస్తున్న డాక్టర్లను మరియు సిబ్బందిని నేను ప్రశంసిస్తున్నాను మరియు అభినందిస్తున్నాను''