శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 26 అక్టోబరు 2021 (19:54 IST)

మణిపాల్‌ హాస్పిటల్ విజయవాడలో 50 బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్స్‌ విజయవంతం

మణిపాల్‌ హాస్పిటల్‌, విజయవాడ వారు 50 బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్స్‌ పూర్తి చేసిన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్‌ జి కృష్ణారెడ్డి, కన్సల్టెంట్‌ మెడికల్‌ ఆంకాలజిస్ట్‌ అండ్‌ బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్‌ ఫిజీషియన్‌ మాట్లాడుతూ, అత్యంత క్లిష్టమైన బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చికిత్సను మనకు దగ్గరలో, విజయవాడలో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఇక్కడ చేయడం చాలా మంచి పరిణామమని, ఆనందించతగ్గ విషయమని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ తరహా క్లిష్టమైన చికిత్సల కోసం సుదూర ప్రాంతాలైన హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్లి ఇబ్బంది పడకుండా మనకు దగ్గరలోనే ఈ చికిత్సలను అందుబాటులోకి తీసుకురావడం చాలా మంచి విషయమని చెప్పారు.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ, బోన్‌మారో చికిత్స పరంగా మా మీద నమ్మకముంచడంతో పాటుగా  తమకు చికిత్స చేసే అవకాశం కల్పించిన పేషంట్స్‌ అందరికీ, వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే  ఆయన మాట్లాడుతూ ఈ చికిత్స విజయవంతమయ్యేందుకు చాలా మంది కృషి అవసరమవుతుందన్నారు.
 
ఇందులో భాగంగా మాకు ఇక్కడ ఆరు పడకల స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ యూనిట్‌ ఉందని, దానికి తోడుగా అన్ని ఫెసిలిటీలు అందుబాటులో ఉన్న బ్లడ్‌బ్యాంక్‌, అత్యంత నైపుణ్యం కలిగిన లేబరేటరీ,అలాగే ఈ చికిత్స విజయవంతం కావడానికి ట్రాన్స్‌ప్లాంటేషన్‌ వైద్య బృందం మాత్రమే కాకుండా మిగిలిన వైద్యులు, ఇంటెన్సివ్‌ కేర్‌ స్పెషలిస్ట్‌లు, రేడియాలజీ సేవలు సహా అందరి సేవలు అందుబాటులో ఉండటం ద్వారా ఈ చికిత్సలను మేము విజయవంతంగా పూర్తి చేయగలిగాము. ఈ సందర్భంగా ఈ చికిత్సలలో పాల్గొన్న డాక్టర్లందరికీ,  అన్ని డిపార్ట్‌మెంట్‌లకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నామన్నారు.
 
డాక్టర్‌ మాధవ్‌- కన్సల్టెంట్‌ హెమటో ఆంకాలజిస్ట్‌, బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్‌ ఫిజీషియన్‌ మాట్లాడుతూ, ‘‘ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ రెండు రకాలు. వాటిలో ఒకటి అటోలోగస్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కాగా రెండోది అల్లోజెనిక్‌ ట్రాన్స్‌ ప్లాంటేషన్‌.  అటోలోగస్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో ఓ రోగి మూలకణాలు సేకరించి, కీమోథెరఫీ తరువాత ఆ మూలకణాలను తిరిగి వారికే ఎక్కించడం చేస్తారు. అలాగే, అల్లోజెనిక్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అనగా పేషంట్‌కు మూలకణాలను వేరే వారి నుంచి ఎక్కించడం. వీటిలో మూడు రకాలు ఉంటాయి. మొదటిది, మ్యాచ్‌ సిబ్లింగ్‌ డొనార్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌.  అంటే, రోగి హెచ్‌ఎల్‌ఏ మూలకణాలతో సరిపోయిన మ్యాచ్డ్‌ (ఝ్చ్టఛిజ్ఛిఛీ)  బ్రదర్స్‌, సిస్టర్స్‌ నుంచి మూల కణాలను సేకరించి రోగికి అందించడం.
 
ఒకవేళ బ్రదర్స్‌, సిస్టర్స్‌ హెచ్‌ఎల్‌ఏ మూలకణాలతో సరిపోయే రీతిలో లేకపోతే అన్‌ రిలేటెడ్‌ డొనార్స్‌ నుంచి తీసుకుని చికిత్స చేస్తాము. దీనిని మ్యాచ్డ్‌ అన్‌ రిలేటెడ్‌ డోనార్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అంటాము. ఒకవేళ బ్రదర్స్‌, సిస్టర్స్‌ లేదంటే బయటి వారి హెచ్‌ఎల్‌ఏ మూల కణాలు మ్యాచ్‌ కాని పరిస్థితులు ఎదురైతే, పేరెంట్స్‌ నుంచి లేదంటే పిల్లల నుంచి తీసుకుని చేసే ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను హాప్లో ఐడెంటికల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అంటాము. అయితే అల్లోజెనిక్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అనేది అత్యంత క్లిష్టతరమైన చికిత్స. దాదాపుగా నూటికి 15-20 %మంది చికిత్స సంబంధిత సైడ్‌ ఎఫెక్ట్స్‌తో చనిపోతుంటారు.
 
వీటిని ట్రాన్స్‌ప్లాంట్‌ రిలేటెడ్‌ మోర్టాలిటీ అంటాం. మేము ఇక్కడ శస్త్ర చికిత్స చేసిన వారు ఎటువంటి ఇబ్బందులు  ఎదుర్కోలేదు. ఎలాంటి ప్రాణ హాని లేకుండా ఈ చికిత్సలను చేశాం. వీటన్నిటిలోనూ అత్యంత క్లిష్టమైనది అల్లోజెనిక్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌. వాటిలోనూ క్లిష్టమైనది అన్‌రిలేటెడ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ మరియు హాప్లో ట్రాన్స్‌ప్లాంట్‌. ఇవన్నీ మేము విజయవంతంగా చేయగలిగాము’’ అని అన్నారు.
 
ఈ సందర్భంగా డాక్టర్‌ సుధాకర్‌ కంటిపూడి- హాస్పిటల్‌ డైరెక్టర్‌ మాట్లాడుతూ, ‘‘డాక్టర్‌ మాధవ్‌ ప్రత్యేకంగా కెనడా వెళ్లి ఓ సంవత్సరం పాటు ఈ ట్రీట్‌మెంట్‌ శిక్షణ కోసం వెళ్లడంతో పాటుగా ఫెలోషిప్‌ పొంది వచ్చారు. వారు ఈ చికిత్సను అందరికీ అవసరమైన రీతిలో అందించడం కోసం శిక్షణ ను పొంది అందరికీ అందుబాటులో ఉండటం ఆనందించతగ్గ విషయం.
 
బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావడం చాలా అభినందించతగ్గ విషయం. ఇది అందరికీ అందుబాటులోకి రావడం వల్ల ఎక్కువమంది పేషంట్స్‌కు ఈ చికిత్సనందించి వారి ప్రాణాలను కాపాడగలుగుతున్నాం. ఈ సందర్భంగా గౌరవనీయ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గారికి, ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ బీ శ్రావణ్‌ కుమార్‌, కన్సల్టెంట్‌ మెడికల్‌ ఆంకాలజిస్ట్‌, డాక్టర్‌ సీహెచ్‌ మనోజ్‌కుమార్‌, చీఫ్‌ ఆఫ్‌ క్లీనికల్‌ సర్వీసెస్‌ పాల్గొన్నారు.