ఆదివారం, 17 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 29 సెప్టెంబరు 2021 (22:43 IST)

ప్రపంచ హృదయ దినోత్సవం: యోగా- ఫిట్‌నెస్‌పై మణిపాల్ హాస్పిటల్స్ అవగాహన కార్యక్రమం

ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా, మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడ, రెడ్‌ ఎఫ్‌ఎం 93.5 భాగస్వామ్యంతో కెఎల్‌ యూనివర్శిటీ వద్ద యోగా మరియు ఫిట్‌నెస్‌(జుంబా డ్యాన్స్‌) అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దాదాపు 200 మందికి పైగా పాల్గొన్నారు.
 
గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకతపై పూర్తి సమాచార యుక్తంగా మరియు అవగాహనను పెంచే రీతిలో డాక్టర్‌ సుధాకర్‌ కంటిపూడి- హాస్పిటల్‌ డైరెక్టర్‌ మాట్లాడటంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం ఆరోగ్యం  మెరుగుపరుచుకోవడానికి అనుసరించాల్సిన పద్ధతులను గురించి సీనియర్‌ కన్సల్టెంట్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ ఎన్‌ మురళీ కృష్ణ వెల్లడించారు.
 
ఈ సందర్భంగా మణిపాల్‌ హాస్పిటల్‌ ప్రత్యేకంగా రూపొందించిన యాంజియోగ్రామ్‌/సీటీ యాంజియోగ్రామ్‌ ప్యాకేజీని సైతం ఆవిష్కరించింది. దీనిలో రెండు కార్డియో కన్సల్టేషన్స్‌, కంప్లీట్‌ బ్లడ్‌ కౌంట్‌  (సీబీసీ), ర్యాండమ్‌ బ్లడ్‌ షుగర్‌ (ఆర్‌బీఎస్‌), ఈసీజీ మొదలైన ఇతర ఇన్వెస్టిగేషన్స్‌ భాగంగా ఉంటాయి. ఈ ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం మణిపాల్‌ హాస్పిటల్స్‌‌కు చెందిన బృందంతో పాటుగా కెఎల్‌ యూనివర్శిటీ విద్యార్ధులు మూడు గంటల పాటు ఫిట్‌నెస్‌ అవగాహన సదస్సులో పాల్గొన్నారు.
 
ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ఎన్‌ మురళీకృష్ణ మాట్లాడుతూ, ‘‘ఈ రోజుల్లో, గుండె విఫలం కావడమన్నది అన్ని వయసుల వారిలోనూ అతి సహజంగా కనిపిస్తుంది. యువత మరీ ముఖ్యంగా 30 మరియు 40 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తులలో కూడా హార్ట్‌ ఎటాక్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దురలవాట్లకి లోనవటం, మద్యసానం, పొగ త్రాగడంతో పాటుగా శారీరక వ్యాయామాలు తగినంతగా లేకపోవడం, ఒత్తిడి గణనీయంగా పెరగడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వంటివి గుండె సమస్యలకు అతి ప్రధాన కారణాలు. ఇతర దేశాలతో పోల్చినప్పుడు, భారతీయులు చిన్న వయసులోనే గుండె విఫలమైన సంఘటనలు ఎదుర్కొనే అవకాశం అధికంగా ఉంది. ఆరోగ్యవంతమైన, చురుకైన  జీవనశైలి ద్వారా ఈ స్థితిని మెరుగుపరుచుకోవచ్చు. ప్రస్తుత అంచనాలన్నీ ఆరోగ్యవంతమైన జీవనశైలిని స్వీకరించేలా మనందరికీ ఓ మేలుకొలుపు పిలుపుగా నిలుస్తాయి’’ అని అన్నారు.
 
డాక్టర్‌ సుధాకర్‌ కంటిపూడి మాట్లాడుతూ, ‘‘సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కలిగిన ప్రధానమైన జీవనశైలి వ్యాధుల పట్ల అవగాహన కల్పించడానికి మణిపాల్‌ హాస్పిటల్స్‌ విజయవాడ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. హార్ట్‌ ఫెయిల్యూర్‌ కేసులు పెరుగుతుండటంతో పాటుగా దీని కారణంగా మరణాలు కూడా అధికంగా సంభవిస్తుండటంతో తమ గుండె ఆరోగ్యం కాపాడుకోవడానికి అనుసరించాల్సిన మార్గాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది.  
 
పూర్తిగా అంకితం చేసిన హార్ట్‌ ఫెయిల్యూర్‌ నివారణ కార్యక్రమాలు లాంటి వాటి ద్వారా మరిన్ని సేవలను మేము అందిస్తున్నాం. ఇవి గుండె వ్యాధులకు సంబంధించి సమగ్రమైన చికిత్సలను అందిస్తాయి. రోగి కేంద్రీకృత సౌకర్యాలు, నిష్ణాతులైన స్పెషలిస్ట్‌లు మరియు అత్యుత్తమ శ్రేణి ఫలితాలతో కూడిన ట్రాక్‌ రికార్డ్‌ ద్వారా ఈ మహోన్నత కారణానికి మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడ వద్ద మేము కట్టుబడి ఉన్నాం’’ అని అన్నారు.
 
ఈ కార్యక్రమ అనంతరం హృదయాకారపు గ్యాస్‌ బెలూన్స్‌ను గాలిలోకి డాక్టర్‌ సుధాకర్‌ కంటిపూడి, డాక్టర్‌ ఎన్‌ మురళీకృష్ణ, డాక్టర్‌ సందీప్‌ ఎన్‌- కన్సల్టెంట్‌ కార్డియాలజిస్ట్‌; డాక్టర్‌ శ్రీనివాస్‌ బాబు- కన్సల్టెంట్‌ సీటీవీఎస్‌; డాక్టర్‌ మోనికా ఈ ఫ్లోరెన్స్‌- కార్డియాలజిస్ట్‌ మరియు డాక్టర్‌ అనిల్‌ కుమార్- కన్సల్టెంట్‌ ఎనస్థీషియస్ట్‌ మరియు కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎగురవేశారు. ‘వాల్‌ ఆఫ్‌ హార్ట్‌’ యాక్టివిటీలో గుండె ఆరోగ్యం పట్ల తమ భావనలను ప్రపంచ హృదయ దినోత్సవ సందర్భంగా విద్యార్ధులు పంచుకున్నారు. కార్డియాలజీ హెల్త్‌ చెక్‌ మరియు డైట్‌ చార్ట్‌ బ్రోచర్‌ను తమ గుండె ఆరోగ్యం పట్ల మరింతగా అవగాహనను మెరుగుపరుచుకునే రీతిలో కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ అందజేశారు.