బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By srinivas
Last Updated : గురువారం, 21 జూన్ 2018 (12:35 IST)

షుగర్ రోగులకు అధునాతన పరికరం

రక్తనమూనా లేకుండానే మధుమేహ వ్యాధిగ్రస్తులు శరీరంలో చక్కెర స్థాయిని చూసుకోవడానికి ఓ అధునాతన పరికరాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు సెయింట్ పీటర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ పరిశోధన కేంద్రంలోని

రక్తనమూనా లేకుండానే మధుమేహ వ్యాధిగ్రస్తులు శరీరంలో చక్కెర స్థాయిని చూసుకోవడానికి ఓ అధునాతన పరికరాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు సెయింట్ పీటర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ పరిశోధన కేంద్రంలోని బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం తెలిపింది. రోగి ముక్కు ద్వారా గాలిని ఈ పరికరంలోకి వదులుతూ చక్కెర స్థాయిని తెలుసుకోవచ్చని తెలిపింది. 
 
ఈ పరికరాన్ని బయో మెడికల్ విభాగాధిపతి డాక్టర్ కాంతారాజ్ సూచనలతో విద్యార్థిని నాన్సి కలిసి కనుగొన్నారు. ఈ పరికరంతో వేయి మందిని ఉపయోగించగా చాలా వరకూ ఖచ్చితమైన ఫలితాలు వచ్చినట్టు పేర్కొన్నారు.