శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 24 మే 2023 (15:41 IST)

వేసవిలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి?

ghee
వేసవిలో తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. జీర్ణాశయానికి ఇబ్బంది పెట్టే పదార్థాలను తీసుకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కనుక వేసవిలో ఎలాంటి పదార్థాలు తీసుకుంటే మంచిదో తెలుసుకుందాము. వేసవిలో జిడ్డుగా వుండే నూనె, నెయ్యితో చేసిన పదార్థాలను మితంగా తీసుకుంటే తేలికగా జీర్ణమవుతాయి. క్యాబేజీ, బీరకాయ, పొన్నగంటి కూర, బచ్చలి కూర, కరివేపాకు, పొట్లకాయ కాకర వంటివి తీసుకోవడం మంచిది.
 
అంజీర, పనస, ద్రాక్ష, ఖర్జూర, బత్తాయి, దానిమ్మ, అరటి పండ్లు తీసుకుంటుంటే మేలు కలుగుతుంది. వేసవిలో గోధుమ పిండితో చేసిన పూరీల కంటే గోధుమ రవ్వతో ఉప్మా వంటివి మంచిది. చెరుకు రసం కంటే చెరుకు ముక్కలను నమిలి తినడం ఎంతో మంచిది. గ్లాసులో మూడొంతుల నీటికి పావు వంతు నిమ్మరసం కలుపుకుని తాగితే వేసవి తాపం తీరుతుంది. గోరువెచ్చటి పాలలో అటుకులు వేసుకుని తింటుంటే శరీరానికి చలువ చేస్తుంది.