శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: సోమవారం, 19 జూన్ 2017 (20:08 IST)

వెల్లుల్లితో ఊపిరితిత్తుల వ్యాధులను నిరోధించవచ్చు...

కాలాలతో సంబంధం లేకుండా చాలామంది ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో సతమతమవుతుంటారు. ఐతే వెల్లుల్లితో ఈ సమస్యలను అడ్డుకోవచ్చు. వెల్లుల్లిలో నీటి ద్వారా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు, సైనస్‌ను నివారిస్తుంది. టీబీతో బాధపడే వారు ఒక గ్లాసు పాలతో ఒక గ్లాసు

కాలాలతో సంబంధం లేకుండా చాలామంది ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో సతమతమవుతుంటారు. ఐతే వెల్లుల్లితో ఈ సమస్యలను అడ్డుకోవచ్చు. వెల్లుల్లిలో నీటి ద్వారా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు, సైనస్‌ను నివారిస్తుంది. టీబీతో బాధపడే వారు ఒక గ్లాసు పాలతో ఒక గ్లాసు నీరు, పది మిరియాలు, కొంచెం పసుపు పొడి, ఒక వెల్లుల్లి బెరడును వేసి కాసేపు వేడి చేసి దానిని సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది. 
 
అలాగే వెల్లుల్లి మనం తీసుకునే ఆహారంలో కలిపి తీసుకుంటే శరీరంలో వ్యర్థ పదార్థాలు, వైరస్ వంటివి తొలగిపోతాయి. ఇంకా రక్త కణాలను వెల్లుల్లి శుభ్రపరుస్తుందని, అనవసరమైన కొవ్వును కరిగిస్తుంది. శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. మన శరీరానికి తగిన ఆక్సిజన్ లభించడంతో ఒత్తిడి మాయమవడంతో పాటు నరాల పనీతీరు, శ్వాసప్రక్రియ క్రమమవుతుంది. క్యాన్సర్‌తో బాధపడేవారు మందులతో పాటు పూర్తి వెల్లుల్లిని ఉడికించి రోజూ తీసుకుంటే క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేయవచ్చు. మొటిమలపై వెల్లుల్లి రసాన్ని రుద్దితే మంచి ఫలితం ఉంటుంది.