సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 30 జనవరి 2018 (12:49 IST)

నానబెట్టిన బ్రెడ్ ముక్కలను పూరీ పిండితో కలిపితే..?

ఆకుకూరలు వండేటప్పుడు ఒక స్పూన్ పంచదార కలిపిన నీటిలో నానబెట్టి తర్వాత వండితే రుచి అదిరిపోతుంది. పూరీలకు పిండి సిద్ధం చేసేటప్పుడు నీటిలో నానబెట్టిన బ్రెడ్ ముక్కలను పిండేసి.. వాటిని పూరీ పిండితో కలిపి పూ

ఆకుకూరలు వండేటప్పుడు ఒక స్పూన్ పంచదార కలిపిన నీటిలో నానబెట్టి తర్వాత వండితే రుచి అదిరిపోతుంది. పూరీలకు పిండి సిద్ధం చేసేటప్పుడు నీటిలో నానబెట్టిన బ్రెడ్ ముక్కలను పిండేసి.. వాటిని పూరీ పిండితో కలిపి పూరీలు చేస్తే.. కరకరలాడుతాయి. రుచి బాగుంటుంది. కూరగాయలు, పండ్లను కాసింత వెనిగర్ కలిపి చల్లటి నీటిలో కొన్ని నిమిషాల పాటు వుంచితే క్రిములు నశించివేస్తాయి. 
 
పచ్చని కొత్తిమీర, కరివేపాకును వంటల్లో వాడటం ద్వారా లేదా పచ్చిగా ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఉదయం పూట ఆపిల్ జ్యూస్ తీసుకునే వారిలో ఉదర సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. రక్త ప్రసరణ మెరుగవుతుంది. 
 
అలాగం రోజూ అవిసాకు తీసుకుంటే పేగుసంబంధిత రోగాలను దూరం చేసుకోవచ్చు. టీ, కాఫీలకు బదులు రోజూ శొంఠి కాఫీ తాగితే సోమరితనం తొలగిపోతుంది. కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది. కందగడ్డను తీసుకునే వారిలో పైల్స్ సమస్య తొలగిపోతుంది.