శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 17 సెప్టెంబరు 2018 (11:15 IST)

ఆస్తమా వ్యాధికి ఈ చిట్కాలు పాటిస్తే...?

ఆస్తమా వ్యాధి వచ్చిన వారికి ఊపిరితిత్తుల్లో గాలి ప్రవాహంలో అడ్డంకులు ఏర్పడుతుంటాయి. దీంతో దగ్గు, గురక వంటి సమస్యలు వస్తుంటాయి. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈ చిట్కాలను పాటిస్తే ఆస్తమా వ

ఆస్తమా వ్యాధి వచ్చిన వారికి ఊపిరితిత్తుల్లో గాలి ప్రవాహంలో అడ్డంకులు ఏర్పడుతుంటాయి. దీంతో దగ్గు, గురక వంటి సమస్యలు వస్తుంటాయి. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈ చిట్కాలను పాటిస్తే ఆస్తమా వ్యాధి నుండి సమర్థవంతంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
గ్లాస్ పాలలో రెండు వెల్లుల్లి రెబ్బలను వేసుకుని వాటిని బాగా మరిగించుకోవాలి. ఈ పాలను తీసుకోవడం వలన ఆస్తమా వ్యాధి నుండి ఉపశమనం లభిస్తుంది. నిత్యం తాగే టీలో కొద్దిగా అల్లం వెల్లుల్లి రసాలను వేసుకుని టీ రూపంలో తీసుకుంటే కూడా ఆస్తమా వ్యాధి నుండి విముక్తి చెందవచ్చును. ప్రతిరోజూ ఉదయాన్నే గ్లాస్ గోరువెచ్చని నీటిలో కొద్దిగా తేనెను కలుపుకుని తాగాలి. తద్వారా ఆస్తమా వ్యాధి నుండి బయటపడవచ్చును.
 
రాత్రివేళ గిన్నె నీళ్లల్లో కొద్దిగా మెంతులను నానబెట్టుకోవాలి. వాటిని మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపును తీసుకుంటే ఇన్‌ఫెక్షన్స్ తగ్గుతాయి. తులసి ఆకులను ఉదయాన్నే తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా కాఫీ తాగితే అందులోని ఔషధ గుణాలు శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.