సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (15:24 IST)

ప్రతిరోజూ ఆకుకూరలను ఆహారంలో చేర్చుకుంటే?

ఆకుకూరలు ఆరోగ్యానికి చక్కని ఔషధంగా పనిచేస్తాయి. పాలకూర, బచ్చలి, పుదీనా, కొత్తమీర వంటి ఆకుకూరలను సలాడ్ రూపంలో తీసుకుంటే శరీరానికి కావలసిన పోషక విలువలు నేరుగా అందుతాయి. తద్వారా శరీర రోగనిరోధక శక్తి పెరు

ఆకుకూరలు ఆరోగ్యానికి చక్కని ఔషధంగా పనిచేస్తాయి. పాలకూర, బచ్చలి, పుదీనా, కొత్తమీర వంటి ఆకుకూరలను సలాడ్ రూపంలో తీసుకుంటే శరీరానికి కావలసిన పోషక విలువలు నేరుగా అందుతాయి. తద్వారా శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
 
ఆకుకూరల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ సాఫీగా జరిగేలా సహాయపడుతాయి. వీటిల్లోని న్యూటియన్స్ అనారోగ్య సమస్యల నుండి కాపాడుతాయి. ముదురు పచ్చ ఆకుకూరల్లో క్యాల్షియం, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఇవి కణజాలాల ఆరోగ్యానికి మంచిగా ఉపయోగపడుతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుటకు ఆకుకూరలు చక్కగా పనిచేస్తాయి. 
 
ఆకుకూరల్లోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, ఎ వంటి ఖనిజాలు రక్తకణాల ఆరోగ్యానికి మంచిగా దోహదపడుతాయి. ముఖ్యం గుండె వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఇంకా చెప్పాలంటే చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో అలసట, ఒత్తిడి తొలగిపోయి రోజంతా ఎనర్జీగా ఉంటారు. హైబీపి, మధుమేహం వంటి వ్యాధులు నుండి కాపాడుతాయి.