మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (12:48 IST)

బొప్పాయి గుజ్జు, పసుపుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

టమోటా గుజ్జులో కొద్దిగా గ్లిజరిన్, గంధపు పొడి కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం మెుటిమలు తొలగిపోతాయి. ముల్తానీ మట్టిలో కలబంద గుజ్జు,

టమోటా గుజ్జులో కొద్దిగా గ్లిజరిన్, గంధపు పొడి కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం మెుటిమలు తొలగిపోతాయి. ముల్తానీ మట్టిలో కలబంద గుజ్జు, పెరుగు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది.
 
వేపాకుల రసంలో కొద్దిగా తులసి ఆకుల రసాన్ని కలుపుకుని మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన మెడ భాగం తెల్లగా మారుతుంది. ఓట్స్ పొడిలో రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. తద్వారా ముఖం మృదువుగా మారుతుంది. 
 
గ్రీన్ టీలో కలబంద గుజ్జును కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 10 నిమిషాల తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బొప్పాయి గుజ్జులో కొద్దిగా పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో ముఖం కోమలంగా మారుతుంది.