శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By tj
Last Updated : శుక్రవారం, 23 జూన్ 2017 (12:40 IST)

ఇలా చేస్తే గుండెపోటే రాదు...!

మనం చాలా వరకు వెల్లుల్లి నిమ్మరసాలను వంటల్లో మసాలాల కోసమో.. మంచి సువాసన కోసమే వాడుతుంటాం. కానీ ఈ రెండు కలిపితే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఎవరికి తెలియదు. రక్తనాళాల్లో ఎక్కువగా పేరుకుపోయిన కొల

మనం చాలా వరకు వెల్లుల్లి నిమ్మరసాలను వంటల్లో మసాలాల కోసమో.. మంచి సువాసన కోసమే వాడుతుంటాం. కానీ ఈ రెండు కలిపితే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఎవరికి తెలియదు. రక్తనాళాల్లో ఎక్కువగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు, ఫార్మా కంపెనీల్లో ఉన్న పదార్థాలు కూడా ఇవేనట. రసాయనిక చర్యలతో తయారైన మందులు ఎందుకు వాడాలి. సహజ సిద్ధంగా ఉన్న వాటిని మనమే తయారు చేసుకుని వాడితే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. దీంతో రక్తసరఫరా మెరుగవుతుంది. దీంతో గుండె జబ్బు వచ్చే అవకాశం లేదని వైద్యులు చెబుతున్నారు.
 
ఒకవేళ ఇది వరకే గుండె జబ్బు ఉన్న వారు దీన్ని తాగితే గుండె జబ్బు తగ్గే అవకాశం ఉందంటున్నారు. అధికబరువుతో బాధపడేవారు గుండెజబ్బు నుంచి తప్పించుకునే మార్గం ఇది. 30 వెల్లుల్లి రెబ్బలు, ఆరు నిమ్మకాయలు తీసుకోవాలి. నిమ్మకాయలను కోసి రసం తీయాలి. వెల్లుల్లి పొట్టు తీసి ముక్కలుగా కోయాలి. ఆ తర్వాత నీళ్ళు పోసుకుని రెండింటిని మిశ్రమంగా చేసుకోవాలి. 
 
ఆ తర్వాత రెండు లీటర్ల నీటిని కలవాలి. ఆ తర్వాత పదినిమిషాల పాటు వేడి చేయాలి. ఆ తర్వాత వడగట్టి గాజు సీసాలో ఉంచి ఫ్రిజ్ లో వడగట్టాలి. తయారు చేసుకున్న మిశ్రమాన్ని ప్రతిరోజు 50 ఎంఎల్ పరగడపున తాగాలి. ఇలా మూడువారాల పాటు తీసుకోవాలి. తిరిగి వారం రోజుల పాటు గ్యాప్ ఇవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ మూడువారాల పాటు తాగాలి. ఇలా ఆరునెలల పాటు తాగాలి. ఇలా చేస్తే గుండెకు రక్తనాళాలను పంప్ చేసే నాళాల్లో కొవ్వు కరిగిపోయి ఫ్రీ అవుతాయి.