శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 10 జనవరి 2020 (21:35 IST)

అధిక రక్తపోటును అధిగమించేందుకు చిట్కాలు

నిత్యం చెవులు చిల్లులుపడే రణగొణధ్వనులు, అమితమైన లైట్ల వెలుతురులో ఎక్కువ రోజులు ఉన్నా రక్తపోటు సమస్య వస్తుంది. అందుకని వీటికి కొంతకాలం దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అధిక రక్తపోటును అడ్డుకునేందుకు ఈ క్రింది చిట్కాలు పాటిస్తే ఫలితం వుంటుంది.
 
1. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు రక్తపోటు తీవ్రతను తగ్గించే గుణాలు అధికంగా ఉన్నాయి. ఇవి చేప నూనెల్లో, అవిసె గింజల ద్వారా తీసిన నూనెల ద్వారా లభిస్తాయి.
 
2. ఆహారంలో మార్పుల ద్వారా రక్తపోటును తగ్గించుకోవచ్చు. ఆహార ప్రణాళికలో ఎక్కువ మొత్తంలో పండ్లు, కూరగాయలు, కొవ్వుశాతం తక్కువగా ఉండే పాల ఉత్పత్తులు తీసుకోవాలి.
 
3. రక్తపోటుకు ప్రధానమైన శత్రువు ఒత్తిడి. శారీరక, మానసిక ఒత్తిడులను తగ్గించుకోగలిగితే ఎన్నో జబ్బులను దరిచేరకుండా చూసుకోవచ్చు.
 
4. ఒత్తిడి నుంచి విశ్రాంతి పొందడానికి ధ్యానం, యోగా.. వంటి మార్గాలను అనుసరించాలి. అలాగే మనసుకు ఆహ్లాదం కలిగించే వాతావరణంలో కొద్ది సేపు తిరగాలి.