మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : మంగళవారం, 5 మార్చి 2019 (17:22 IST)

నిమ్మను కట్ చేసి ఇలా చేస్తే..?

దుర్వాసన విషయానికి వస్తే.. శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడమే. ఈ వాసన నుండి ఉపశమనం పొందాలంటే.. మరిగిన నీళ్లతో కాకుండా గోరువెచ్చని వేడి నీటితో రోజుకు రెండుపూటల స్నానం చేయాలి. ముఖ్యంగా ఏదైనా పనిమీద బయటకు వెళ్లి వచ్చినా, వ్యాయామం చేసినా తప్పకుండా స్నానం చేయాలి. లేదంటే.. బాహుమూలల కింద ఏర్పడే చెమట బ్యాక్టీరియాకు ఆహారంగా మారుతుంది. 
 
అంతేకాదు.. దీని వలన బ్యాక్టీరియా మరింత ముదిరి దుర్వాసన పెంచుతుంది. నిత్యం బాహుమూలలను శుభ్రం చేసుకుంటే బ్యాక్టీరియా పెరిగేందుకు అవకాశమే ఉండదు. దీని ఫలితంగా దుర్వాసన కూడా క్రమేణా కనుమరుగవుతుంది. చెమట సమస్య ఎక్కువగా ఉండేవారు.. తరచు కాటన్ దుస్తులు ధరిస్తే మంచిది. ముఖ్యంగా వేసవిలో ధరించడం ఎంతైనా ముఖ్యం. 
 
బాహుమూలల్లో వెంట్రుకలు ఉంటే కూడా దుర్వాసన అధికంగా వస్తుంది. వాటిని ఎప్పటికప్పుడు తొలగించకపోతే దుర్వాసనను మరింత పెంచుతుంది. అలానే నిమ్మ చెడు బ్యాక్టీరియాలను చంపడంలో ఎంతగానో దోహదపడుతుంది. అందువలన ఓ చిన్న నిమ్మకాయను తీసుకుని దానిని రెండు సగాలుగా కట్ చేసి బాహుమూలల్లో అప్లై చేయాలి. కాసేపు  ఆగాక ఆపై స్నానం చేయండి. ఇలా రోజూ చేస్తుంటే.. దుర్వాసన నుండి ఉపశమనం లభిస్తుంది.