సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 31 మే 2019 (18:46 IST)

బత్తాయి రసంలో జీలకర్ర, అల్లం పొడి వేసుకొని తాగితే?

వేసవి కాలం ఎండలు ఇంకా వదల్లేదు. ఈ కాలంలో డీహైడ్రేషన్ సమస్య ఎక్కువుగా ఉంటుంది. దీని నుంచి శరీరాన్ని కాపాడుకోవాలంటే ఎక్కువ మోతాదులో పండ్లు, పండ్లరసాలు, మంచినీరు, మజ్జిగా ఎక్కువుగా తాగుతూ ఉండాలి. వేసవిలో బత్తాయి పండ్లు మంచి మేలు చేస్తాయి. బత్తాయిలో మంచి పోషకాలే కాకుండా ఔషధ గుణాలు కూడా చాలా ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.
 
1. ముఖ్యంగా బత్తాయిలోని ఆమ్లాలు శరీరంలో పేరుకున్న టాక్సిన్లను బయటకు పంపేందుకు దోహదపడతాయి. ఇది జీర్ణసమస్యలను నివారిస్తుంది.
 
2. మలబద్దకంతో బాధపడేవాళ్లకి బత్తాయి రసంలో చిటికెడు ఉప్పువేసి ఇస్తే ఫలితం ఉంటుంది. ఇందులోని పొటాషియం మూత్రపిండాలు, మూత్రాశయంలో వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గడానికి దోహదపడుతుంది.
 
3. డయేరియా వల్ల కలిగే అలసటకీ, నీరసానికి బత్తాయిరసం అద్బుతమైన మందు.
 
4. బత్తాయిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి, స్కర్వీ వ్యాధి నివారణకు తోడ్పడుతుంది. చిగుళ్లు నుంచి రక్తం కారుతుంటే బత్తాయి రసంలో చిటికెడు బ్లాక్ సాల్టు కలిపి రాస్తే వెంటనే ఫలితం ఉంటుంది.
 
5. ప్లూ, వైరస్‌లతో బాధపడే వాళ్లకి ఈ రసం బాగా పనిచేస్తుంది. వీటిలో సమృద్దిగా ఉండే ప్లేవనాయిడ్లు అల్సర్‌ను తగ్గిస్తాయి.
 
6. గర్భిణీల్లో శిశువు పెరుగుదలకు బత్తాయి రసంలో పోషకాలు అన్నీ దోహదపడతాయి. ఇది రక్తవృద్దికి, వీర్యవృద్దికీ కూడా తోడ్పడుతుంది. నరాల మీద ఒత్తిడినీ తగ్గిస్తుంది.
 
7. బత్తాయిరసంలో జీలకర్ర, అల్లంపొడి వేసుకొని తాగితే ఆస్తమా కారణంగా దగ్గుతో బాధపడేవాళ్లకి ఉపశమనంగా ఉంటుంది. ఇందులోని విటమిన్లు జుట్టు పెరుగుదలకు, చర్మ సౌందర్యానికి దోహదపడతాయి.