ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 29 నవంబరు 2022 (13:46 IST)

తులసి దగ్గర కూర్చుంటే అవన్నీ మటాష్

tulsi
తులసి ఆకులను తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటి తీసుకుంటే కలిగే 8 అద్భుత ప్రయోజనాలను తెలుసుకుందాము.
 
తులసి ఆకు విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. భగవంతుడు తులసి ఆకును సమర్పించగానే వెంటనే స్వీకరిస్తాడని విశ్వాసం.
 
పరగడుపున 4 తులసి ఆకులను తీసుకుంటే జలుబు-దగ్గు, అలర్జీ, మధుమేహం, రక్త సంబంధ సమస్యలు, వాము, పిత్తం, క్యాన్సర్ మొదలైనవి నయమవుతాయి.
 
కలుషిత నీటిలో కొన్ని తాజా తులసి ఆకులను వేయడం ద్వారా నీటిని శుద్ధి చేయవచ్చు.
 
రోజూ కొంతసేపు తులసి దగ్గర కూర్చుంటే శ్వాస, ఆస్తమా వంటి వ్యాధుల నుంచి బయటపడవచ్చు.
 
రోజూ తులసి నీటిని తాగడం వల్ల ఒత్తిడి తొలగిపోయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
 
వాస్తు దోషం పోగొట్టుకోవడానికి అగ్ని కోణం నుండి వాయువ్య కోణం వరకు ఖాళీ స్థలంలో తులసి మొక్కను నాటవచ్చు.
 
ఇంట్లో సంక్షోభం ఏర్పడితే తులసికే ముందుగా తెలిసి ఎండిపోతుందని అంటారు.
 
తులసిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.