శనివారం, 4 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : శుక్రవారం, 4 జనవరి 2019 (14:49 IST)

జున్ను తింటే.. ఏం జరుగుతుందో తెలుసా..?

ఆవు లేదా గేదె ప్రసవించినప్పుడు మొదటిసారిగా వచ్చే పాలను జున్ను పాలు అని అంటారు. అలాకాకుంటే.. సాధారణ పాలను కూడా బాగా కాచితే కూడా జున్ను తయారుచేసుకోవచ్చును. ఈ జున్నులో పాలకంటే అధిక మోతాదులో పోషక విలువలు ఉన్నాయి. ఈ జున్నుతో రకరకాల వంటకాలు చేసి తీసుకుంటారు. దీనిని ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదేనని చెప్తున్నారు వైద్యులు. జున్ను తీసుకుంటే కలిగే మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం.
 
1. చాలామంది చూడటానికి చాలా బక్కగా, సన్నగా ఉంటారు. అలాంటివారు ప్రతిరోజూ జున్ను తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జున్నులోని ప్రోటీన్స్ శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తాయి. తరచూ దీనిని తింటే.. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
 
2. జున్నులో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాల బలానికి ఎంతో దోహదపడుతుంది. గర్భిణి స్త్రీలు ప్రతిరోజూ రెండుపూటలా జున్నులో కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి తీసుకుంటే శిశువు ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. తల్లిపాలు కూడా వృద్ధి చెందుతాయి. 
 
3. జున్నులోని విటమిన్ బి2, ఎ, కె, డి వంటివి జీవక్రియలు సరిగ్గా జరిగేలా చేస్తాయి. జున్ను తరచుగా తీసుకోవడం ద్వారా చర్మం సౌందర్యం కూడా రెట్టింపవుతుంది. 
 
4. జున్ను విరేచననాలు, మలబద్దక సమస్యలను తొలగిస్తుంది. మధుమేహ వ్యాధితో బాధపడేవారు.. రోజుకు ఒక్కసారైనా జున్ను తింటే.. వ్యాధి తగ్గుముఖం పడుతుంది. దాంతో శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
 
5. శరీరంలో విటమిన్ డి కారణంగా ఆస్టియోపోరోసిస్ లోపానికి గురికావలసి వస్తుంది. ఈ లోపాన్ని తొలగించాలంటే.. జున్ను తీసుకోవాలి. జున్నులో విటమిన్ డి అధికంగా ఉంటుంది. ఇది ఈ లోపాన్ని తొలగించుటలో ఎంతో దోహదం చేస్తుంది.