శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : శనివారం, 1 ఏప్రియల్ 2023 (19:35 IST)

పుచ్చకాయ రసం తాగితే?

పుచ్చకాయ రసంలో అధిక స్థాయిలో లైకోపీన్ ఉంటుంది. ఫ్లేవనాయిడ్లు- కెరోటినాయిడ్స్‌తో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ న్యూట్రీయం, హానికరమైన ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా పుచ్చకాయ రసం పోరాడుతుంది. పుచ్చకాయలలో ఉండే శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్ లైకోపీన్ ఆరోగ్యకరమైన గుండెకు బలాన్నిస్తుంది. పుచ్చకాయలో కాల్షియం పుష్కలంగా వుంటుంది కనుక ఎముకల దృఢత్వానికి ఇది మేలు చేస్తుంది.
 
పుచ్చకాయ రసంలో అధిక స్థాయిలో పొటాషియం ఉంటుంది, ఇవి మన శరీరంలోని కండరాలు, నరాలు సజావుగా పనిచేయడానికి సాయపడతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని నిర్వహించడంలో పుచ్చకాయలోని అర్జినైన్ ప్రయోజనకరంగా ఉంటుంది, తద్వారా మధుమేహం రాకుండా నియంత్రిస్తుంది. పుచ్చకాయలో 92% నీరు ఉంటుంది, ఇది చర్మానికి, కేశాలకు మేలు చేస్తుంది.
 
పుచ్చకాయలో వుండే సమ్మేళనాలు, లైకోపీన్, కుకుర్బిటాసిన్ ఇ తదితర పోషకాలు క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి.