శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 17 జనవరి 2021 (00:53 IST)

నాజూగ్గా మారాలంటే.. తమలపాకు.. మిరియాలు చాలు.. (video)

Betel_pepper
నాజూక్కా మారాలంటే.. ప్రతి రోజూ ఉదయం ఒక తమలపాకులో పది మిరియాల గింజలను చుట్టి చిని వెంటనే ఒక గ్లాసు చన్నీళ్లు తాగాలి. ఇలా రెండు నెలలు చేస్తే ఒబిసిటీ సమస్య వేధించదు. అలాగే ముల్లంగి రసం మోతాదుకు మూడు చెంచాల చొప్పున రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. కరక్కాయ పెచ్చుల చూర్ణాన్ని మోతాదుకు అరచెంచా చొప్పున రెండు పూటలా తేనెతో కానీ లేదా వేడి నీళ్లతో కానీ తీసుకోవాలి. 
 
ఇంకా రేగు ఆకుల ముద్దను ఉలవచారు లేదా శనగలతో చేసిన చారుకి కలిపి తీసుకోవాలి. ఆముదం ఆకులను కాల్చి బూడిదను చేసి నిల్వచేసుకోవాలి. దీనిని మోతాదుకు చిటికెడు చొప్పున చిటికెడు ఇంగువ పొడిని కలిపి రెండు పూటలా బియ్యం కడిగిన నీళ్లతో కలిపి తీసుకోవాలి. త్రికటు చూర్ణం (శొంఠి, పిప్పళ్లు, మిరియాలు) లేదా త్రిఫలాలు కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ చూర్ణాన్ని రోజూ అర స్పూన్ మేర తీసుకుంటే బరువు తగ్గుతుంది. వీటితో పాటు పెసర్లు, చిరు శెనగలు తీసుకోవాలి. సోఫాలు, పరుపులు వాడకూడదు. పగటి పూట నిద్రపోకూడదు. 
 
అలాగే మజ్జిగను ఆహారంలో చేర్చుకోవాలి. మనస్సుకు, శరీరానికి ఏదో ఒక వ్యాపకం కలిగించుకుంటూ వుండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుండాలి. తేనెను వేడినీటిలో కలుపుకుని తాగడం.. వేడి నీటిని తీసుకుంటూ వుండటం చేయాలి. అన్ని రుచులు కలిగిన ఆహారాలను తినాలి.

వేపుడు కూరలకు బదులు పులుసు కూరలు తినాలి. ఆహారాన్ని నెమ్మదిగా తినాలి. వేళపట్టున తక్కువ మోతాదులో తీసుకుంటూ వుండాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.