ఆదివారం, 5 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. యోగాసనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 12 సెప్టెంబరు 2022 (22:38 IST)

తులాసనంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

Viloma asanam
కర్టెసి-ట్విట్టర్
యోగాతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మందులతో తగ్గనవి యోగాతో మాయమవుతాయని యోగ నిపుణులు చెపుతారు. ఇక్కడ రెండు యోగాసనాలు వల్ల కలిగే ఫలితాలను చూద్దాం.

 
విలోమ యోగాసనం...
అనుభవజ్ఞులైన అభ్యాసకుల ఆధ్వర్యంలో విలోమ భంగిమ, ఇది బలం, స్థిరత్వం మరియు సత్తువను పెంచుతుంది. ఈ యోగ భంగిమ వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే... చర్మం కాంతివంతంగా మారడంలో సహాయపడుతుంది.

Thulasanam
మెదడు చురుకుదనాన్ని కలిగిస్తుంది. ఒత్తిడి- మెడ టెన్షన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. పొత్తికడుపు దగ్గర కొవ్వును కరిగిస్తుంది. గుండెను ఆరోగ్యంగా వుంచుంతుంది. హృదయ స్పందన రేటును క్రమబద్ధీకరిస్తుంది.
 
తులాసనం అనేది శరీరంలో అగ్నిని సృష్టించే ఒక అధునాతన ఆసనం. మనస్సులో ఏకాగ్రత, అభ్యాసానికి సమతుల్యతను తెస్తుంది. ఈ భంగిమను శ్వాసపై శ్రద్ధగల, స్థిరమైన అవగాహనతో చేసినప్పుడు మరింత ఫలితాన్నిస్తుంది. బలం- జ్ఞానాన్ని తీసుకురాగలదు.