మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 29 జనవరి 2019 (17:38 IST)

అవయవాలు తీసుకున్నారు.. శవాలను పడేశారు.. దంతాలను కూడా?

టాంజానియా దేశంలో దారుణ ఘాతుకం. పది మంది పిల్లల్ని కిడ్నాప్ చేసి, వారి అవయవాలను తీసుకుని శవాలను పడేసిన ఘటన టాంజానియా దేశంలోని నిజోంబీ జిల్లాలో చోటుచేసుకుంది. గత ఏడాది డిసెంబర్‌లో ఆ జిల్లాలో పది మంది పిల్లలు అపహరణకు గురయ్యారు. పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. 
 
కిడ్నాప్ అయిన నెలరోజుల తర్వాత పిల్లల శవాలు లభ్యమయ్యాయని, వాటి నుండి అవయవాలు తీసివేసి ఉన్నారని టాంజానియా డిప్యూటీ ఆరోగ్యశాఖ మంత్రి ఫాస్టిన్ నిడుగుల్లీ వ్యక్తం చేసారు. అవయవాలను సేకరించడం కోసం ఏడేళ్ల వయస్సు గల పిల్లల్ని వారి ఇంటి దగ్గర నుండి గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసారని మంత్రి వివరించారు. 
 
వారి నుండి ప్రధాన అవయవాలతో పాటు దంతాలు కూడా తీసుకున్నారని పోలీసుల సమాచారం. టాంజానియాలో ప్రతి 1500 మంది పిల్లల్లో ఒకరు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఈ విధంగా పిల్లల్ని కిడ్నాప్ చేసి చంపి అవయవాలను వైద్యులకు విక్రయిస్తున్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. ఎట్టకేలకు టాంజానియా పోలీసులు ఈ ఘటనపై స్పందించి అప్రమత్త చర్యలు తీసుకుని దర్యాప్తు కూడా ప్రారంభించారు.