Daily Horoscope
✕

రెండు దశాబ్దాలు పనిచేస్తే చెప్పాపెట్టకుండా తీసేసారు... మైక్రోసాఫ్ట్ టెక్కీ ఆవేదన

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 24 నవంబరు 2026 (13:57 IST)
ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో లే ఆఫ్‌లు కొనసాగుతున్నాయి. అనేక కంపెనీలు ఉద్యోగులను చెప్పాపెట్టకుండా తొలగిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు మాత్రం ముందుగానే సమాచారం ఇస్తున్నాయి. మరికొన్ని సంస్థల విధుల్లో పని చేస్తుండగా లే ఆఫ్ మెయిల్స్ పంపి షాకిస్తున్నాయి. 
 
ఇటువంటి పరిస్థితే టెక్‌ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ ఉన్నతాధికారిణికి ఎదురైంది. ఎప్పటిలాగే విధుల్లో నిమగ్నమై ఉండగా.. లేఆఫ్‌ మెయిల్‌ రావడం తనను తీవ్రంగా బాధించిందని పేర్కొంటూ..ఆమె చేసిన సోషల్‌ మీడియా పోస్ట్‌ వైరల్‌గా మారింది.
 
అమెరికాకు చెందిన లూరా విలియమ్స్ సియాటెల్‌లోని మైక్రోసాఫ్ట్‌ కార్యాలయంలో 24 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తూ.. ప్రిన్సిపల్ నాలెడ్జ్ ఇంజినీరింగ్ మేనేజర్‌ హోదాకు ఎదిగారు. ఇన్నేళ్ల తర్వాత సంస్థ ఒక్కసారిగా తనను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు మెయిల్ రావడంతో నమ్మకలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
'కొన్ని రోజుల క్రితం ఇంజినీరింగ్ బృందాలు తమ సొంత డాక్యుమెంటేషన్‌ను రూపొందించడానికి ఏఐ సాధనాలను ఎలా ఉపయోగించవచ్చనే దానిపై జూనియర్లకు 90 నిమిషాల ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించాను. మీటింగ్‌ మధ్యలో ఉండగా మెయిల్‌ వచ్చింది. అందులో నన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటన చూసి షాక్‌ అయ్యాను. కంపెనీతో 24 ఏళ్ల నా వృత్తి ప్రయాణానికి ఇది ఒక అవమానకరమైన ముగింపు. ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఇన్నేళ్లుగా నాకు మద్దతిచ్చిన సహోద్యోగులు, మేనేజర్లకు కృతజ్ఞతలు' అని గాలారా విలియమ్స్ ఆవేదన వ్యక్తం చేశారు. 
About Author
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

Brahmastra 2: హిందూ పురాణాలలో లోతు తెలియజేసేదిగా బ్రహ్మాస్త్ర 2 : అయాన్ ముఖర్జీ

Prabhas's love song: ఫౌజీలో ప్రభాస్ కోసం లవ్ సాంగ్ చిత్రీకరణ !

Fahadh Faasil : ఫహాద్ ఫాజిల్ హీరోగా థ్రిల్ల‌ర్ మూవీ అసరీరి జనవరి1 రిలీజ్

Deepika Padukone : పారితోషికం విషయంలో నో కాంప్రమైజ్ - అందుకే ప్రభాస్ తో చేయనన్న దీపికా పదెకొనే !

Sony Telugu channel : ప్రముఖ ఛానల్స్ కు పోటీగా సోనీ తెలుగు ఛానల్ - చెన్నైలో వచ్చే ఏడాది ప్రారంభం ?

తర్వాతి కథనం
Show comments