బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్

రెస్టారెంట్‌లో గ్యాస్ పేలుడు - 31 మంది మృత్యువాత

bomb blast
డ్రాగన్ కంట్రీ చైనాలో భారీ విపత్తు జరిగింది. ఈ దేశంలోని ఓ రెస్టారెంట్‌లో గ్యాస్ పేలుడు ఘటన సంభవించింది. దీంతో 31 మంది మృత్యువాతపడ్డారు. స్థానిక మీడియా కథనం మేరకు.. రెస్టారెంట్‌లో జరిగిన గ్యాస్ పేలుడు వల్ల 31 మంది చనిపోగా మరికొందరు గాయపడినట్టు పేర్కొంది. 
 
ప్రస్తుతం చైనా ప్రజలు డ్రాగన్ బోట్ ఫెస్టివల్‌ను జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. వరుసగా మూడు రోజులు సెలవు దినాలు రావడంతో బంధు మిత్రులతో సరదాగా గడుపుతున్నారు. పండుగ కోసం అంతా గుమికూడివున్న సమయంలో యించువాన్ నగరంలోని ప్యూయాంగ్ బార్బెక్యూ రెస్టారెంట్‌లో బుధవారం రాత్రి ఉన్నట్టుండి భారీ శబ్దంతో ఈ పేలుడు సంభవించింది. 
 
రెస్టారెంట్‍‌లోని ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఒకటి పేలిపోవడంతో 31 మంది చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద వార్త తెలుసుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది, ఫైరింజన్లతో అక్కడకు వచ్చి మంటలను ఆర్పివేశారు.