1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్

టెక్సాస్‌ డెయిరీ ఫాంలో భారీ పేలుడు... 18 వేల ఆవులు మృతి

blast fog
అమెరికా దేశంలోని టెక్సాస్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. ఇక్కడి డిమ్మిట్‌లోని సౌత్ ఫోర్క్ డెయిరీ ఫాంలో హఠాత్తుగా పేలుడు సంభవించడంతో ఏకంగా 18 వేల ఆవులు మృతి చెందాయి. ఈ డెయిరీ ఫామ్‌లో పని చేస్తున్న ఓ మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో చనిపోయిన ఆవుల విలువ సుమారుగా రూ.300 కోట్ల మేరకు ఉంటుందని అంచనా వేశారు. 2013 తర్వాత డెయిరీ ఫాంలలో ఇంత పెద్ద ప్రమాదం సంభవించడం గమనార్హం. 
 
అయితే, ఈ ఘటన ఈ నెల 10వ తేదీన జరిగినట్టుగా తెలుస్తుంది. డెయిరీ ఫాంలోని యంత్రాలు బాగా వేడెక్కడం వల్లే ఈ ప్రమాదం జరిగివుంటుందని భావిస్తున్నారు. పేలుడు జరిగిన ర్వాత ఒక్కసారిగా మీథేన్ వాయువు అధిక మొత్తంలో విడుదలైందని, అందుకే ఆవులు మృతి చెందివుంటాయని అధికారులు భావిస్తున్నారు. అయితే, ప్రమాదానికి గల స్పష్టమైన కారణాలు తెలియాల్సివుంది.