శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (12:46 IST)

యాంకర్ మెడలో పాము.. బుసలు కొట్టడంతో గజగజ వణికిపోయింది... (Video)

woman anchor
ఆస్ట్రేలియాలో ఓ యాంకర్ మెడలో నల్లత్రాచు పామును వేసుకుని యాంకరింగ్ చేసింది. ఆ యువతి యాంకరింగ్ చేస్తున్న సమయంలో ఆ పాము బుసలు కొడుతూ చేతిలోని మైకును కాటేసింది. దీంతో ఆమె వణికిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పాముల భద్రత, విష సర్పాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న అంశాలపై అవగాహన కల్పిస్తూ ఓ మహిళా జర్నలిస్టు ఓ ప్రోగ్రాం చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా తన మెడలో పామును వేసుకుంది. ఆ సమయంలో పాము బుసలు కొట్టడంతో ఆమె భయంతో గజగజా వణికిపోయింది. మూడు సార్లు ఇలా జరిగింది. 
 
ఇందుకు సంబంధించిన వీడియోను స్కై న్యూస్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాలోని వేల్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళా జర్నలిస్టు పట్టుకున్న మైకుపై ఆ పాము కాటు వేసినంత పని చేసింది.