మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 డిశెంబరు 2023 (08:26 IST)

సాయుధమూకల నరమేథం... 160 మంది మృతి.. ఎక్కడ?

deadbody
సెంట్రల్ నైజీరియాలో నరమేథం జరిగింది. సామూహిక మూకలు ఈ దారుణానికి పాల్పడ్డాయి. కొన్ని తెగల ప్రజలే లక్ష్యంగా గ్రామాలపై కాల్పులతో సాయుధ మూకలు విరుచుకుపడ్డారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం వరకు కొనసాగిన ఈ కాల్పుల్లో ఏకంగా 160 మంది మృతి చెందారు. ఈ నరమేథ హంతకులు ఇళ్లలోకి దూరి, చిత్రహింసలకు గురిచేసి ఆపై కాల్చి చంపేశారు. 
 
సెంట్రల్ నైజీరియాలోని బండిట్స్‌గా పలిచే కొన్ని సాయుధ సమూహాలు ఈ అరాచకానికి పాల్పడ్డాయి. పలు గ్రామాల ప్రజలే లక్ష్యంగా కాల్పులు జరిపాయి. కాల్పులతో నరమేథం సృష్టించాయి. వరుస కాల్పుల్లో 160 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టుగా స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కాల్పుల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, సోమవారం కూడా కాల్పులు కొనసాగడంతో ఈ మృతుల సంఖ్య ఒక్కసారిగా పెగిపోయింది. దాదాడు 300 మంది వరకు గాయపడగా, మొత్తం మృతుల సంఖ్య 160కి చేరింది. 
 
కొన్ని తెగలకు చెందిన ప్రజలే లక్ష్యంగా సాయుధ మూకలు మారణకాండకు పాల్పడ్డాయని, ఇళ్లలోకి చొరబడి ప్రజలను చిత్రహింసలకు గురిచేశారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కాగా, మధ్య నైజీరియాలో కొన్నేళ్లుగా ఈ తరహా దాడులతో వణికిపోతుంది. సామాజిక మతపరమైన, మతపరమైన విభేదాలు ఘర్షణలకు కారణమవుతున్నాయి. వాయువ్య, మధ్య నైజీరియాలో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. వేల సంఖ్యలో అమాయకుల ప్రాణాలు కోల్పోతున్నారు.