1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 14 డిశెంబరు 2023 (10:22 IST)

మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబో ఈజ్ బ్యాక్

Ravi Teja- Harish Shankar
Ravi Teja- Harish Shankar
రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ నిర్మించనున్న ఎంటర్‌టైనర్ కోసం మూడోసారి చేతులు కలిపారు. వివేక్ కూచిభొట్ల ఈ చిత్రానికి సహ నిర్మాత. హరీష్ శంకర్‌ని దర్శకుడిగా పరిచయం చేసింది రవితేజ అయితే, రవితేజకు మాస్ మహారాజా ట్యాగ్ ఇచ్చింది హరీష్. మరోవైపు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రవితేజ నటించిన ‘ధమాకా’ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. దీంతో ఈ మాస్, క్రేజీ కాంబినేషన్‌లో చిత్రం ధమకేధార్ ఎంటర్‌టైనర్‌ను అందించబోతోంది.
 
ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాని ఈరోజు అధికారికంగా అనౌన్స్ చేశారు. హరీష్ శంకర్ తన హీరోలను మ్యాసియస్ట్ అవతార్ లో చూపించడంలో దిట్ట. రవితేజతో హరీష్ చేసిన గత చిత్రం ’మిరపకాయ్’ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ కాంబినేషన్‌లో సినిమా కోసం అభిమానులు, మాసెస్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  
 
సినిమా ఎలాంటి మాస్ ఎలిమెంట్స్‌ను కలిగి ఉంటుందో తెలియజేయడానికి ..‘ఈసారి మాస్ రీయూనియన్ స్పైసీగా ఉంటుంది’ అని మేకర్స్ అనౌన్స్ చేశారు.  
 
హై ప్రొడక్షన్, టెక్నికల్ స్టాండర్డ్స్‌తో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌ కోసం హరీష్ శంకర్ ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేయనున్నారు.  
మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.