సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2023 (18:22 IST)

తాంత్రిక పూజలు.. తీర్థం పేరిట యాసిడ్.. 11మందిని చంపేసిన కిల్లర్

acid
తాంత్రిక పూజల పేరుతో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 11మందిని పొట్టనబెట్టుకున్నాడు దుర్మార్గుడు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన సీరియల్ కిల్లర్ బాగోతం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. సీరియల్ కిల్లర్ సత్యనారాయణ యాదవ్ అమాయకులైన ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని.. తన మంత్రశక్తితో గుప్త నిధులను వెలికితీస్తానని నమ్మబలికాడు. 
 
తనకు పరిచయమైన వారిని నమ్మించి వారి వద్ద వున్న భూములను లాక్కునేవాడు.  ఎవరైనా తిరగబడితే గుట్టుచప్పుడు కాకుండా హత్యకు తెగబడతాడు. తీర్థం పేరుతో నోటిలో యాసిడ్ పోసి చంపేవాడు. ఇలాగే ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక వ్యక్తిని చంపగా, ఆ కేసు విచారిస్తుండగా పోలీసులకు ఈ కిల్లర్‌ సత్యం అఘాయిత్యాలు వెలుగులోకి వచ్చాయి. 
 
ఆ సీరియల్ కిల్లర్‌ని ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు పోలీసులు. విచారణలో షాకింగ్ నిజాలు తెలియవచ్చాయి. 2020 నుంచే ఇలా హత్యలకు పాల్పడుతున్నాడని తేలింది.