శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 జూన్ 2021 (13:23 IST)

కోవాగ్జిన్ సరఫరాకు అనుమతి నిరాకరణ.. భారత్‌ బయోటెక్‌కు ఎదురుదెబ్బ!

అమెరికాలో భారత ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థ తయారు చేస్తున్న కావాగ్జిన్ సరఫరాకు అమెరికా భారీ షాక్‌ ఇచ్చింది. సంస్థ అభివృద్ది చేసిన కరోనా మహమ్మారి వ్యాక్సిన్‌ కోవాగ్జిన్‌ అత్యవసర వినియోగాన్ని ఎఫ్‌డీఏ తిరస్కరించింది. 
 
కరోనా మహమ్మారి కోసం భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్‌ వ్యాక్సిన్ అత్యవసర వినియోగాన్ని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) తిరస్కరించింది. ఈ టీకా వినియోగానికి సంబంధించిన భారత్ బయోటెక్‌, యూఎస్‌ భాగస్వామ్య కంపెనీ ఆస్ట్రాజెనికాతో ప్రతిపాదనలను అమెరికా ప్రభుత్వం తోసిపుచ్చింది. 
 
మరోవైపు భారత్‌లో వ్యాక్సినేషన్‌ కోవాగ్జిన్‌ను చేర్చిన దాదాపు ఆరు నెలల తర్వాత కూడా భారత్ బయోటెక్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ డేటాను వెల్లడించలేదన్న విమర్శల సమయంలో అమెరికాలో ఎదురుదెబ్బ తగలడం గమనార్హం.
 
అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను తాము గుర్తించట్లేదని ప్రకటించిన అతి కొద్దిరోజుల్లోనే ఈ పరిణామం సంభవించింది. చాలా ఆలస్యంగా దరఖాస్తులు చేసుకోవడమే దీనికి కారణమని తెలుస్తోంది.
 
మరోవైపు, ఇకపై అత్యవసర అనుమతి కోరబోమని, కోవిడ్ టీకా ఆమోదం కోసం దాఖలు చేస్తామని కంపెనీ గురువారం తెలిపింది. అదనపు క్లినికల్ ట్రయల్ ప్రారంభించమని ఎఫ్‌డీఏ సిఫారసు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, అత్యవసర వినియోగానికి అవసరమైన బయోలాజిక్స్ లైసెన్స్ అప్లికేషన్ (బీఎల్ఎ) కోసం దరఖాస్తు చేస్తామని తెలిపింది.