Dharma Sangrah
✕

అమెరికా నెత్తిన మంచు కుంపటి...

Written By కుమార్
Updated: గురువారం, 14 మార్చి 2019 (15:42 IST)
ఒకపక్క భారతదేశంలో ఎండలు వణికిస్తుండగా మరోవైపు అమెరికాలో మంచు తుఫాన్లు వణిస్తున్నాయి. గంటకు 148 కిలోమీటర్ల వేగంతో అమెరికాలోని రాకీ పర్వతాల నుండి వీస్తున్న చలిగాలుల ప్రతాపానికి దాదాపు 25 రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. కొలరాడో, డకోటా, నెబ్రస్కా వంటి నగరాల్లో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. 
 
ఎక్కడ చూసినా రోడ్లపై భారీగా మంచు పేరుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరికొన్ని చోట్ల మంచుపై వాహనాలు జారిపోయి ఇతర వాహనాలను ఢీకొంటున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయి. మంచుతోపాటు పిడుగులు కూడా పడుతుండటంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో అనేక ప్రాంతాలు చీకట్లోనే ఉన్నాయి. ఈ తుఫాన్ పేరును 'బాంబ్ తుఫాన్'గా నామకరణం చేసారు.
 
మంచు తీవ్రంగా కురుస్తుండటంతో కొలరాడోలోని డెన్వర్ ఎయిర్‌పోర్ట్‌ను తాత్కాలికంగా మూసివేసారు. అమెరికా మొత్తంమీద 1339 విమాన సర్వీసులు రద్దయ్యాయి. న్యూమెక్సికోలో వీచిన బలమైన గాలులకు ఒక రైలుకు ఉన్న 26 బోగీలు వంతెనపై నుండి పడిపోయాయి. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.

అన్నీ చూడండి

Prashanth Neel: ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న హారర్ థ్రిల్లర్‌ 418 రిలీజ్ డేట్ ఫిక్స్

Babumohan: చాక్లెట్ స్టార్ పవన్ హీరోగా పోతిరెడ్డిపల్లి మూవీ ప్రారంభం

వెంకటేష్ - త్రివిక్రమ్ చిత్రం ఆదర్శ కుటుంబం విడుదల వాయిదా

Naga Vamsi: ఆలస్యంగానైనా ఆదర్శ కుటుంబం రిలీజ్ అవుతుంది : సూర్యదేవర నాగవంశీ

ఐటీ దాడులతో తనకెలాంటి సంబంధం లేదు : రకుల్ ప్రీత్ సింగ్

తర్వాతి కథనం
Show comments