సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (12:24 IST)

జపాన్‌ సైన్యంలో మహిళలపై లైంగిక వేధింపులు.. నిజమే..

Japan Army
Japan Army
జపాన్‌ సైన్యంలో మహిళలపై లైంగిక వేధింపులు జరిగాయని అక్కడి సైన్యం అంగీకరించింది. ఇందుకు గాను జపాన్ సైన్యం క్షమాపణ కోరుకుంది. ఓ మాజీ సైనికురాలికి తోటి సిబ్బంది నుంచి ఎదురైన వేధింపులపై జరిపిన దర్యాప్తులో ఈ విషయాలు వెల్లడైనట్లు జపాన్‌ ఆర్మీ అధికారికంగా వెల్లడించింది.
 
తోటి సైనికుల నుంచి ఎంతోకాలం పాటు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానంటూ రీనా గొనోయ్‌ అనే మాజీ సైనికురాలు సంచలన ఆరోపణలు చేశారు. తనతోపాటు ఎంతో మంది మహిళలు వేధింపులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉద్యమాన్ని చేపట్టారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన రక్షణశాఖ.. ఆమె ఆరోపణలపై అంతర్గత దర్యాప్తు జరిపించింది. ఆ దర్యాప్తులో రీనా చేసిన ఆరోపణలు నిజమని తేలాయి. 
 
ఈ నేపథ్యంలో 'లైంగిక వేధింపుల వల్ల సుదీర్ఘకాలం పాటు ఎంతో వేదనను ఎదుర్కొన్న రీనా గొనోయ్‌కు క్షమాపణలు కోరుతున్నా' అని విలేకరుల సమావేశంలో గ్రౌండ్‌-సెల్ఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ చీఫ్‌ యోషిహిదే యోషిదా పేర్కొన్నారు. 
 
మరోవైపు జపాన్‌ సైన్యంలో వివిధ రకాల వేధింపులకు సంబంధించి 2016లో 256 ఫిర్యాదులు రాగా.. 2021లో 2311 ఫిర్యాదులు వచ్చినట్లు జపాన్‌ రక్షణశాఖ వెల్లడించింది.