మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 మార్చి 2022 (12:16 IST)

జపాన్ పాఠశాలల్లో పోనీటైల్‌పై నిషేధం

జపాన్ పాఠశాలల్లో పోనీటైల్ జడలపై నిషేధం విధించారు. విద్యార్థినిలు పోనీటైల్స్ తరహాలో వెంట్రుకలు ముడి వేసుకోరాదని పేర్కొంది. ఎందుకంటే పోనీటైల్స్ విద్యార్థులను లైంగికంగా ఉత్తేజపరుస్తాయని పేర్కొంటున్నారు. 
 
ఇదే అంశంపై వైస్ వరల్డ్ న్యూస్ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. ప్రాథమిక పాఠశాలకు చెందిన రిటైర్డ్ టీచర్ ఒకరు స్పందిస్తూ, విద్యార్థినిలు పోనీటైల్ తరహాలో జడలు వేసుకుని రావడానికి వీల్లేదని పాఠశాల యజమాన్యం తనతో చెప్పారని వెల్లడించారు. ఎందుకంటే ఈ తరహా జడలు విద్యార్థినుల మెడ భాగం బాగా కనిపిస్తుందని, ఇది బాలురులను లైంగికంగా ఉత్తేజపరుస్తుందన్నది వారి అభిప్రాయంగా ఉందని తెలిపారు. 
 
అంతేకాకుండా, జపాన్ స్కూల్స్‌లలో మరో ఆసక్తికర అంశం ఒకటి వెలుగులోకి వచ్చింది. జపాన్‌లోని చాలా పాఠశాలలో బాలికలు తెల్లటి లోదుస్తులనుూ మాత్రమే ధరించాలని సూచించినట్టు సమాచారం. దీనిపై అనేక మంది విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ, విద్యార్థినిలకు స్కూల్ యాజమాన్యం ఆదేశాలను పాటించడం మినహా మరో మార్గం లేకుండాపోయింది.