లాక్ డౌన్ వద్దంటూ.. బికినీతో నిరసన.. ఎక్కడ.. ఎవరు?
లాక్ డౌన్ వద్దంటూ ఓ మహిళ బికినీలో నిరసన తెలిపింది. జల్సా జీవితాలకు అలవాటైన వారు ఖాళీగా కూర్చోలేక ఇబ్బంది పడుతున్న. లాక్‌డౌన్ ఎత్తివేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ ఏకంగా బికినీ వేసుకొచ్చి మరీ నిరసన తెలిపింది. అందరూ చూస్తుండగానే.. నడిరోడ్డుపై ఒంటిపై మాస్కులతో చేసిన చిన్న చిన్న బికినీ ముక్కలు ధరించి ఆందోళనకు దిగింది.
వివరాల్లోకి వెళితే.. వాషింగ్టన్ నగరానికి చెందిన దవీద సాల్ అనే ఓ కళాకారిణి ఈ విధంగా చేసింది. వెంటనే లాక్‌డౌన్ ఎత్తివేయాలంటూ గళం విప్పింది. ఓ షాపింగ్ మాల్‌కు వచ్చి సరుకులు కొన్న తర్వాత అక్కడే బయట నిలబడి ఈ విధంగా చేసింది. మాస్కులతో తయారు చేసిన టూ పీస్ బికినీతో నిలబడింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇవి కాస్త వైరల్ అయి కూర్చున్నాయి.
ఇంకా తన నిరసనపై అభిప్రాయాలను చెప్పాలంటూ సోషల్ మీడియా ద్వారా నెటిజన్లను కోరింది. ప్రస్తుతం నెటిజన్లు లాక్ డౌన్‌పై తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.