సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 ఆగస్టు 2023 (15:34 IST)

ఉద్యోగులకు మెటా సీరియస్ వార్నింగ్.. మూడు రోజులు రాకపోతే..

Meta
ఉద్యోగులకు మెటా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ప్రతి వారంలో  కనీసం మూడు రోజులు ఆఫీసుకు రావాలని..కొత్త రూల్స్ పెచ్చింది. నూతన నిబంధనలకు పాటించని వారు తమ ఉద్యాగాలను కోల్పోవాల్సి వుంటుంది. సెప్టెంబర్ 5 నుంచి కార్యాలయాలకు కేటాయించిన ఉద్యోగులు వారంలో విధిగా మూడు రోజులు రావాలంటూ మానవ వనరుల విభాగం హెడ్ లోరి గోలర్ ఆదేశించారు.
 
టీమ్ సభ్యులు ఈ సూచనను విధిగా పాటిస్తున్నదీ, లేనిదీ మేనేజర్లు తనిఖీ చేయాలని లోరీ గోలర్ తెలిపారు. తరచుగా నిబంధనలను ఉల్లంఘించే వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని మెటా హెచ్చరించింది. ఉద్యోగుల పనితీరు రేటింగ్ తగ్గించడంతోపాటు, మరీ తీవ్రమనిపిస్తే తొలగించడం జరుగుతుందని మెటా తెలిపింది.