శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2019 (12:56 IST)

మీ ఆతిథ్యం అమితానందానికి గురిచేసింది : జీ జిన్‌పింగ్

రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ఆతిథ్యానికి మంత్రమగ్ధులయ్యారు. ఈ పర్యటనలో భాగంగా, ప్రధాని మోడీ - జిన్‌పింగ్‌లు శనివారం మహాబలిపురం సముద్రతీరంలో ఉన్న ఓ నక్షత్ర హోటల్‌లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. 
 
ఈ భేటీలో చైనా అధినేత మాట్లాడుతూ, 'మీరు ఇచ్చిన ఆతిథ్యం మ‌మ్మ‌ల్ని అమితానందానికి గురి చేసింది. నేను, మా అధికారులంతా ఇదే ఫీలింగ్‌తో ఉన్నాం. ఈ అనుభ‌వాలు.. త‌న‌కు, త‌న బృందానికి చిర‌కాల స్మృతుల‌గా మిగిలిపోతాయి అని జిన్‌పింగ్ అన్నారు. 
 
అలాగే, శుక్ర‌వారం మ‌హాబ‌లిపుంలో జ‌రిగిన స‌మావేశం గురించి కూడా జిన్‌పింగ్ గుర్తు చేశారు. మామ‌ల్ల‌పురంలో మ‌నం ఇద్ద‌రు స్నేహితుల్లా మాట్లాడుకున్నట్టు వెల్లడించారు. ద్వైపాక్షిక సంబంధాల‌పై మ‌న‌స్ఫూర్తిగా చ‌ర్చించుకున్నామ‌ని జిన్‌పింగ్ చెప్పారు.