గురువారం, 29 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 మార్చి 2023 (12:25 IST)

గ్రీస్‌లో ఎదురెదురుగా ఢీకొన్న రైళ్లు - 26 మంది సజీవ దహనం

greece train accident
గ్రీస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘోర విపత్తులో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. 85 మంది గాయపడ్డారు. వీరిలో వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని గ్రీస్ అధికారులు అంటున్నారు. ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో బోగీలకు నిప్పంటుకుని దగ్ధమైపోయాయి. మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఏథెన్స్ నుంచి థెసాలోన్కి వెళుతున్న ఓ ప్రయాణికుల రైలు, తెంపీ సమీపంలో ఎదురుగా వస్తున్న గూడ్సూ రైలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. 
 
ఈ ప్రమాద తీవ్రతకు ప్రయాణికుల రైలుకు చెందిన తొలి మూడు బోగీల్లో భారీగా మంటలు చెలరేగాయి. పలు బోగీలు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో ప్యాసింజర్ రైలులో దాదాపు 350 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 200 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. ప్రమాద తీవ్రతకు ధ్వంసమైన ముందు భోగీల్లో 26 మంది సజీవదహనం కాగా, మరికొంతమందిని భద్రతా సిబ్బంది రక్షించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.