సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2023 (16:48 IST)

ఆరు నెలల పసికందును పొట్టనబెట్టుకున్న ఎలుకల గుంపు

అమెరికాలో ఎలుకల గుంపు ఓ చిన్నారిని పొట్టనబెట్టుకున్నాయి. ఊయలలో నిద్రిస్తున్న ఆరు నెలల పసికందుపై ఎలుకల గుంపు దాడి చేసింది. ఆరు నెలల పసికందు ఎముకలు తెలిసేలా దాడి చేశాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఇండియానా పోలీసులు చిన్నారి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఇండియానాలో నివాసం ఉండే డేవిడ్, ఏంజెల్ షోనాబామ్ దంపతుల ఆరు నెలల పసికందు ఊయలలో హాయిదా నిద్రపోతున్నాడు. ఆ సమయంలో ఎలుకల గుంపు చిన్నారిపై దాడి చేసింది. చిన్నారి శరీరంలోని ఎముకలు కూడా బయటకు వచ్చేలా ఎలుకలు 50కి పైగా కొరికేశాయి. రక్తం మడుగుల్లో ఉన్న చిన్నారిని చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. 
 
ఈ చిన్నారి కంటే ముందు ఆ తల్లిదండ్రులకు నలుగురు పిల్లలు వున్నట్లు గుర్తించారు. ఇంటి మొత్తం బంధువులతో ఆ ఇల్లు నిండిపోయింది. ఇంకా అపరిశుభ్రంగా వుంది. దీంతో ఆ చెత్తకింద ఎలుకలు ఆవాసం ఏర్పరుచుకున్నట్లు వెల్లడించారు. 
 
గతంలో కూడా ఇలానే ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులపై ఎలుకలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచినట్లు చెప్పారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు నిర్ధారించారు. ఈ ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.