గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (10:56 IST)

రష్యాలో కూలిన విమానం.. 65 మంది మృత్యువాత

రష్యాలో విమానం ఒకటి కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగు ప్రయాణ సిబ్బందితో పాటు మొత్తం 65 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. ఈ విమానం మాస్కోలోని రెండో అతి పెద్ద విమానాశ్రయం డొమోదెదొవొ నుంచి ఓర్స్క్‌ నగరాని

రష్యాలో విమానం ఒకటి కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగు ప్రయాణ సిబ్బందితో పాటు మొత్తం 65 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. ఈ విమానం మాస్కోలోని రెండో అతి పెద్ద విమానాశ్రయం డొమోదెదొవొ నుంచి ఓర్స్క్‌ నగరానికి వెళ్లేందుకు టేకాఫ్‌ అయిన రెండు నిమిషాలకే రాడార్ల పరిధి నుంచి మాయమైంది. ఆ తర్వాత ఈ విమానం మాస్కోకు చేరువలోని రేమన్‌స్కై జిల్లాలో ప్రమాదానికి గురైంది. 
 
రష్యాలో ఇటీవల రికార్డుస్థాయి హిమపాతం నమోదువుతోంది. ప్రమాదానికి కారణం వాతావరణ పరిస్థితులా, మానవ తప్పిదమా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గురైన విమానం అంటొనొవ్‌ యాన్‌-148 రష్యాకు చెందిన సరతొవ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందినది. ఈ ప్రమాదంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.