Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకలో ఉగ్రదాడులు... 100 మందికి పైగా మృతి

Updated: ఆదివారం, 21 ఏప్రియల్ 2019 (11:53 IST)
శ్రీలంక రాజధాని కొలంబోని పలు ప్రాంతాల్లో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. కొలంబోలోని రెండు ప్రార్థనా మందిరాల్లో, హోటల్స్‌ను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు పేలుళ్లు జరిపారు. బాంబు పేలుళ్లలో దాదాపుగా 100 మందికి పైగా చనిపోగా, వందలాది మంది మృతి గాయపడినట్టు సమాచారం. క్షతగాత్రుల్లో 40 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాడు. పరిసర ప్రాంతాల్లోని భవనాలకు పగుళ్లు వచ్చాయి. 
 
తొలుత బట్టికలోవా ప్రాంతంలోని ఓ చర్చిలో పేలుడు సంభవించింది. ఆపై, హోటల్ షాంగ్రీలా, హోటల్ సినామోన్ గ్రాండ్‌లో కూడా పేలుళ్లు చోటుచేసుకునాన్నాయి. ఆపై సెయింట్ ఆంథోనీ ప్రార్థనామందిరం, సెయింట్ సెబాస్టియన్ చర్చిల్లోనూ విస్ఫోటనం జరిగింది. ఈస్టర్ పండుగ సందర్భంగా క్రైస్తవులు ప్రార్థనల్లో ఉండగా ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. పేలుళ్లు జరిగిన ప్రాంతాలు క్షతగాత్రులతో తీవ్ర దిగ్భ్రాంతి కలిగించేలా ఉన్నాయి. ముఖ్యంగా, ఓ వ్యక్తి కదలిక లేకుండా పడివుండగా, పక్కనే ఓ చిన్నారి అత్యంత దీనంగా ఏడుస్తుండడం అందరినీ కలచివేస్తోంది. 

అన్నీ చూడండి

Adivi Sesh: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ 2027న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

Nani: న్యాచురల్ స్టార్, కయాదు లోహార్ బ్రాండ్ న్యూ పోస్టర్

Allu and Rashmika: రాకా కోసం క్రేజీ కాంబినేషన్ పుష్ప జోడీ మళ్లీ రంగంలోకి దిగింది !

Manchu Mano: ఆస్మాన్ తో మేఘాంశ్ గొప్ప హిట్ కొట్టాలని కోరుకుంటున్నా : మంచు మనోజ్

SS Rajamouli: వారణాసిలో రామాయణ ఎపిసోడ్ కోసం భారీ సెట్టింగ్ ?

తర్వాతి కథనం
Show comments