బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 1 మార్చి 2019 (12:56 IST)

ఢిల్లీలో బాంబు పేలుళ్ళకు జైషే మొహ్మద్ కుట్ర

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి భారత వైమానిక విమానాలు తమ స్థావరాలపై దాడులు చేయడాన్ని జైషే మొహ్మద్ తీవ్రవాద సంస్థ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. ముఖ్యంగా బాలాకోట్‌లోని జైషే తీవ్రవాద స్థావరం పూర్తిగా నేలమట్టమైంది. ఇక్కడ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ పూర్తిగా ధ్వంసమైంది. 
 
దీనికి ప్రతీకారం తీర్చుకునే దిశగా జైషే సంస్థ కుట్రలు పన్నుతోంది. ఇందులోభాగంగా దేశ రాజధాని ఢిల్లీలో 29 కీలక ప్రదేశాలలో తీవ్రవాద దాడులు చేసేందుకు కుట్ర పన్నాయి. కేంద్ర ఇంటలిజెన్స్‌ వర్గాలు ఈ విషయాన్ని పసిగట్టి భగ్నం చేశాయి. ఈ ఘటనతో కేంద్ర హోంశాఖ ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించింది. సమస్యాత్మక ప్రాంతాలు, విమానాశ్రయాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లతో పాటు రద్దీ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను సిద్ధం చేసింది.