ఐపీఎల్ నుండి మలింగ ఔట్..

మోహన్| Last Updated: బుధవారం, 3 ఏప్రియల్ 2019 (15:31 IST)
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కోసం భారత్‌ వచ్చిన శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగ.. ఐపీఎల్ ముగియకముందే స్వదేశానికి తిరిగి వెళ్లనున్నాడు. ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న మలింగ ఈ సీజన్‌లో తొలుత ఐపీఎల్ ఆడటానికి అనుమతిచ్చిన శ్రీలంక క్రికెట్ బోర్డు..తనకు ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకుంటూ..వెంటనే మలింగ స్వదేశానికి తిరిగి రావాలంటూ కబురు పంపింది. 
 
ప్రపంచ కప్‌ దగ్గర పడుతుండడంతో అతడిని శ్రీలంకలో గురువారం నుంచి ప్రారంభంకాబోయే సూపర్‌ ప్రోవిన్సియల్‌ వన్డే టోర్నీలో ఆడించాలని లంక బోర్డు నిర్ణయించింది. దీంతో అతను బుధవారం శ్రీలంక బయల్దేరి వెళ్లనున్నాడు. అక్కడ జరగబోయే టోర్నీలోని గాలె జట్టుకు లసిత్‌ మలింగ నాయకత్వం వహించనున్నాడు.దీనిపై మరింత చదవండి :