శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (14:11 IST)

ముంబైలో 3/34.. పల్లెకెలెలో 7/49.. ఎలా సాధ్యమైంది..?

శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగా ముందుగా ఊహించినట్లే ఐపీఎల్ నుండి సగంలోనే నిష్క్రమించాడు. ముందుగా శ్రీలంక బోర్డు ఐపీఎల్ ఆడేందుకు మలింగాకు అనుమతినిచ్చింది..అయితే తాజాగా దేశవాళీ టోర్నీ ఆడేందుకు అతడిని స్వదేశానికి తిరిగి రమ్మన్న సంగతి తెలిసిందే. 
 
బుధవారం నాడు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ మ్యాచ్ ఆడిన మలింగా.. తర్వాతి రోజు శ్రీలంకలోని పల్లెకెలెలో వన్డే మ్యాచ్‌లో పాల్గొన్నాడు. ఐపీఎల్లో భాగంగా బుధవారం నాడు చెన్నై సూపర్‌కింగ్స్‌పై చక్కటి బౌలింగ్‌ ప్రదర్శనతో 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన మలింగా.. మరుసటి రోజు గాలె జట్టు తరపున బరిలోకి దిగి కాండీ జట్టును వణికించాడు. 
 
కేవలం 49 పరుగులకే 7 వికెట్లు తీసి ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో మలింగ జట్టు ఘనవిజయం సాధించింది. ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడిన 12 గంటల్లోపే ఈ మ్యాచ్‌ ఆరంభం కావడం విశేషం.