శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 మార్చి 2023 (08:18 IST)

లింగమార్పిడితో అమ్మాయిగా మారిన ట్రిచాడ.. బడా పారిశ్రామికవేత్తతో వివాహం

poyd treechanda
థాయ్‌లాండ్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ పోయిడ్ ట్రాచాడ ఇంటికి కోడలైంది. తన 17 యేళ్ల వయసులో అమ్మాయిగా మారింది. ఆ తర్వాత పలు అందాల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. ఆరు సినిమాలతోనే ఆమె స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. నిజానికి ట్రిచాడ పుట్టుకతోనే అబ్బాయిగా జన్మించి ఆ తర్వాత అమ్మాయిగా మారిన ట్రిచాడ ఇపుడు బడా పారిశ్రామికవేత్తను పెళ్లి చేసుకోవడం గమనార్హం. 36 యేళ్ల పోయిడ్ ట్రిచాడ... అద్భుతమైన అందంతో సూపర్ మోడల్‌గా గుర్తింపు పొందారు. ఆమెకు పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఇన్‌స్టాలో ఆమెకు 26 లక్షలమంది ఫాలోయర్లు ఉన్నారు. 
 
థాయ్‌లాండ్‌లోని ఫెంగ్‌నాలో 1986లో పోయిడ్ జన్మించారు. మగబడ్డగా పుట్టినప్పటికీ పెద్దయ్యాక అమ్మాయిల లక్షణాలు కనిపించడంతో ఆమె 17 యేళ్ల వయసులో లింగ మార్పిడి చికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత పలు అందాల పోటీల్లో పాల్గొని విజేతగా నిలించారు. 2010లో విత్ లవ్ చిత్రంలో ఆమె సినిమాల్లోకి ప్రవేశించారు. స్పైసీ బ్యూటీ క్వీన్ బ్యాంకాక్ 2 ఫిల్మ్ సినిమాలో నటించారు. ఆ తర్వాతపలు సినిమాల్లో నటించారు. అయితే, ఈమె కేవలం ఆరేళ్లలో ఆరు చిత్రాల్లో మాత్రమే నటించినప్పటికీ మంచి స్టార్‌డమ్‌తో పాటు ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు.