ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 మే 2020 (14:36 IST)

భార్యతో మాటల్లేవ్... కిమ్‌కు సవతి పోరు.. అందుకే మాయమయ్యాడా?

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ 20 రోజుల పాటు కనిపించకుండా పోయారు. ఆపై బయటికి వచ్చారు. ఓ ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా కిమ్ రిబ్బన్ కట్ చేశారని ఓ వార్తా సంస్థ వెల్లడించింది. ఇంతలోనే కిమ్ ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదనే వార్తలు ప్రపంచ వ్యాప్తంగా చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో కిమ్‌కి సవతి పోరంటూ వార్తలు వస్తున్నాయి. 
 
సాధారణంగా కిమ్‌కి అమ్మాయిల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు. అతను ఏ దేశం వెళ్ళిన సరే అందమైన అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటారని చెప్పారు. తన కేబినేట్‌లో ఉండే ఒక అందమైన అమ్మాయితో కిమ్ ప్రేమలో పడ్డాడట. ఆ అమ్మాయికి పెళ్లి అయింది. అయితే దేశ ద్రోహం కేసులో ఆమె భర్తకు జైలు శిక్ష విధించారు. మరి కిమ్ ఆ అమ్మాయి కోసం శిక్ష వేశాడని అందరూ అంటున్నారు. ఇందులో ఎంతమాత్రం నిజముందో తెలియదు.
 
అంత వరకు బాగానే ఉంది గాని… ఇప్పుడు ఆమె గురించి భార్యకు బాబు దూరంగా ఉన్నాడట. ఆ దేశ రాజధాని పాంగ్యాంగ్‌కి దగ్గరగా ఒక చిన్న రిసార్ట్ ఉంది. ఆ రిసార్ట్‌లో అతని భార్యతో కలిసి వెళ్ళే వాడు. ఇప్పుడు అతను ఆ అమ్మాయితో కలిసి అక్కడ ఉన్నాడట, ఈ విషయం తెలిసిన అతని భార్య అతని మీద గుర్రుగా వుందని.. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని.. ఫలితంగా భార్యతో మాటల్లేవని తెలిసింది. ఇక కిమ్ భార్యకు నచ్చజెప్పే పనిలో ఉన్నాడని, అసలు ఫ్యామిలీ గొడవలతోనే అతను బయటకు రాలేదు అంటున్నారు.