శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 డిశెంబరు 2021 (15:12 IST)

ఉత్తర కొరియాలో 11 రోజులు నవ్వకూడదు... ఉల్లంఘిస్తే జైలేగతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ అధ్యక్షుడు కింమ్ జాంగ్ ఇల్ వర్థంతి సందర్భంగా ఈ తరహా ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా జైలుకు కూడా పంపుతామని హెచ్చరించారు.
 
మాజీ అధ్యక్షుడు కింగ్ జాంగ్ ఇల్ 10వ వర్థంతి నేపథ్యంలో దేశ ప్రజలు 11 రోజుల పాటు నవ్వడం, మద్యం సేవించడం, షాపింగ్ చేయడంపై నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని, ఎవరైనా ఆదేశించాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు.
 
కాగా, ఈ తరహా ఆంక్షలపై ఆ దేశ ప్రజల్లో మిశ్రమ స్పందన లభిస్తుంది. గత వర్థంతి సందర్భంగా ఇదే తరహా ఆంక్షలు విధించారన్నారు. ముఖ్యంగా, అపుడు మద్యం సేవించిన వారిని అరెస్టు చేశారనీ, వారు ఆచూకీ ఏమైందో ఇప్పటివరకు తెలియదని వారు అంటున్నారు. చివరకు అంత్యక్రియలు కూడా నిర్వహించేందుకు ఉండదని గుర్తుచేశారు. 
 
మరోవైపు, ఈ వర్థంతిని పురస్కరించుకుని వివిధ రకాలైన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఉత్తర కొరియా సిద్ధమవుతుంది. కిమ్ జాంగ్ ఇల్ జీవితానికి సంబంధించిన ఫోటోలను ప్రదర్శించడం వంటి కార్యక్రమాలను చేపట్టనుంది.