ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 26 మే 2022 (23:08 IST)

పాకిస్తాన్ మరో శ్రీలంకలా మారనుందా? ఏటీఎంలలో డబ్బుల్లేవ్, పెట్రోల్ బంకుల్లో పెట్రోలు లేదు...

పొరుగు దేశం పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం కోరల్లో కూరుకుపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికే శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తలెత్తి అక్కడి పౌరులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇదే పరిస్థితి పాకిస్తాన్ దేశంలో తాండవించే పరిస్థితి కనబడుతోంది.

 
ఇక్కడ రోజురోజుకీ నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎం సెంటర్లలో డబ్బులు లేకుండా వుంటున్నాయి. పెట్రోల్ బంకుల్లో పెట్రోలు వుండటంలేదు. ఈ పరిస్థితికి మీరు కారణమంటే మీరని అధికార-ప్రతిపక్ష పార్టీలు కొట్టుకుంటున్నాయి.

 
మరోవైపు దేశంలోని పరిస్థితిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ ట్వీట్ చేసారు. లాహోర్‌లోని పెట్రోలు బంకుల్లో పెట్రోల్ లేదనీ, ఏటీఎం కేంద్రాల్లో డబ్బులు లేవని ట్వీట్లో పేర్కొన్నాడు. రాజకీయ నేతల నిర్ణయాల వల్ల సామాన్య పౌరులు ఎందుకు ఇబ్బంది పడాలంటూ ప్రశ్నించాడు.


మరోవైపు ఇస్లామాబాదులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు చేస్తున్నారు. ఇమ్రాన్ వల్ల నిత్యావసర వస్తువులు, ఆర్థిక సంక్షోభం తలెత్తిందని గద్దె దించినప్పటికీ కొత్త ప్రభుత్వం ఇప్పటివరకూ చేసిందేమీ లేదు. దీనితో పాకిస్తాన్ ప్రజలు తీవ్ర అసంతృప్తితో వున్నారు.