శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 జులై 2023 (10:38 IST)

సెల్ ఫోన్ దొంగను ప్రేమించిన యువతి.. ఎందుకో తెలుసా?

Cell phone thief
Cell phone thief
బ్రెజిల్‌లో సెల్‌ఫోన్‌ను దొంగిలించిన దొంగతో ఓ యువతి ప్రేమలో పడింది. వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌కు చెందిన ఇమ్మాన్యుయేల్ అనే యువతి ఒకరోజు బయటకు వెళుతుండగా చేతిలో సెల్‌ఫోన్‌ తీసుకుని పారిపోయాడు. దొంగ దొంగ అని పెద్దగా అరిచినా ప్రయోజనం లేకపోయింది. 
 
అయితే కొంతసేపటికి సెల్‌ఫోన్‌ తీసుకుని పారిపోయిన దొంగ.. ఆ సెల్‌ఫోన్‌లో ఉన్న మహిళ ఫోటో చూసి, ఆమె చాలా అందంగా ఉందని భావించి, ఆమె వద్దకు వచ్చి దొంగతనం చేసినందుకు క్షమాపణలు చెప్పి, సెల్‌ఫోన్ తిరిగి ఇచ్చాడు. ఇలా దొంగ తన ఫోనును తనకిచ్చేయడంతో సదరు యువతి దొంగపై మనసు పారేసుకుంది. 
 
అంతే వీరిద్దరూ ప్రేమలో పడిపోయారు. వీరి ప్రేమాయణం రెండేళ్ల పాటు నడుస్తోంది. త్వరలో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.